జంటగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఇండియా డే పరేడ్ లో ఆకర్షణీయంగా
79వ స్వాతంత్ర్య వేడుకలు ఆగస్టు 15న ఇండియాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎర్రకోటలో ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇక భారతదేశంలో ఎంత ఘనంగా వేడుకలు జరిగాయో అంతే ఘనంగా విదేశాల్లోనూ ఇండియా డేను నిర్వహించడం విశేషం. ఇక యూనైటెడ్ స్టేట్స్ టాలీవుడ్ తారలు సందడి చేశారు.
ప్రతి ఏడాది ఇండియాతో పాటు విదేశాల్లోనూ ఇండియా డేను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా న్యూయార్క్ లో 43వ ఇండియా డే పరేడ్ మార్షల్ కు ఇండియా ప్రతినిధులుగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా హాజరయ్యారు. మార్షల్స్ లో అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి ఇండియన్స్, ఎన్ఆర్ఐలతో పాటు అమెరికన్స్ కూడా ఆకర్షించారు. గతేడాది అల్లు అర్జున్ హాజరు కాగా, ఈసారి వీరిద్దరూ మార్షల్స్ లో మెరియడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరిని జంటగా చూసి అభిమానుల కడుపు నిండిపోయిందని అంటున్నారు.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు మరింత ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు వీరిద్దరి నుంచి రెండు చిత్రాలు వెండితెరపైకి వచ్చాయి. ఇక మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా? అని అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా కనిపించి ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న న్యూయార్క్ ఇండియా డే పరేడ్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. చాలా కాలం తర్వాత ఇలా జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇక న్యూయార్క్ లో ఫెడరేషన్ ఆప్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్ వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ స్టార్స్ మార్షల్స్ లో పాల్గొని భారతీయ సంతతికి చెందిన వారిని ఇలా పలకరిస్తూ ఉంటారు.
న్యూయార్క్ లోని స్ట్రీట్ నెంబర్ 38లో ఇండియా డే పరేడ్ మార్షల్ ను నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇండియన్ ఫ్లాగ్స్ ను ఎగరవేస్తూ విదేశాల్లో నివసించే భారతీయుల్లో మరింత ఐక్యతను చాటారు. ఇక బుర్జ్ ఖలీఫాపైన కూడా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఆ కార్యక్రమం కూడా విజయ్ దేవరకొండ చేతుల మీదుగా జరగడం విశేషం. ఇక విజయ్ దేవరకొండ చివరిగా కింగ్డమ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రష్మిక మందన్న చివరిగా కుబేరా చిత్రంతో అలరించింది. నెక్ట్స్ ది గర్ల్ ఫ్రెండ్, మైసా అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











