twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరు నిర్మాతలే.. నా కెరీర్‌ను నిలబెట్టారు.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

    |

    జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డీ సురేష్ బాబు, పుస్కుర్ రాంమోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ప్రిన్స్ చిత్రాన్ని నిర్మించారు. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

    నాగ్ అశ్విన్ కిందా మీద పడి నవ్వేవాడు

    నాగ్ అశ్విన్ కిందా మీద పడి నవ్వేవాడు


    ఇక డైరెక్టర్ అనుదీప్ కేవీ గురించి చెప్పాలి. నేను ఎవడే సుబ్రమణ్యం సినిమా చేసేటప్పుడు.. అనుదీప్ షార్ట్ ఫిలిం పెట్టుకొని చూస్తూ మా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కిందా మీద పడి నవ్వేవాడు. ఎప్పుడు అనుదీప్ గురించి మాట్టాడేవాడు. అనుదీప్, నాగ్ అశ్విన్.. జాతిరత్నాలు అనే బ్లాక్ బస్టర్ సినిమాను అందించారు. ఇప్పుడు ప్రిన్స్ అనే ఫన్నీ మూవీతో అనుదీప్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

    నాకు స్ట్రెస్ కలిగితే అనుదీప్ వీడియోలు చూస్తా

    నాకు స్ట్రెస్ కలిగితే అనుదీప్ వీడియోలు చూస్తా


    ప్రిన్స్ మూవీ ట్రైలర్ చూశాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను ఎదైనా స్ట్రెస్‌లో ఉంటే.. అనుదీప్ వీడియోలు చూస్తుంటాను. అనుదీప్ ఇంటర్వ్యూలు, వీడియోలు చూస్తాను. ఇటీవల శివకార్తీకేయన్, అనుదీప్ చేసిన ప్రమోషనల్ వీడియోలు చూశాను. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అనుదీప్ చేస్తున్న పెద్ద చిత్రాలు చూసి.. అందరికి వినోదం పంచుతున్న తీరుతో గర్వంగా ఫీలవుతున్నాను. ఈ ఎప్రిల్ 21వ తేదీన మీకు మరో బ్లాక్ బస్టర్ రావాలని కోరుకొంటున్నాను అని విజయ్ దేవరకొండ అన్నాడు.

    మారియాకు శుభాకాంక్షలు

    మారియాకు శుభాకాంక్షలు


    ఇండియన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్న మారియాకు నా శుభాకాంక్షలు. మీ దేశంలో జరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో ఈ సినిమాకు మధురానుభూతులు పంచుతాయని, ఆనందాన్ని కలుగజేస్తుందని నమ్ముతున్నాను అని విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.

    మనోజ్ పరమహంసను ఇప్పటికీ చూడలేదు

    మనోజ్ పరమహంసను ఇప్పటికీ చూడలేదు


    నేను తమన్, హరీష్ శంకర్‌తో ఇప్పటి వరకు వర్క్ చేయలేదు. త్వరలోనే వర్క్ చేయాలని కోరుకొంటున్నాను. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస గురించి చాలా రోజుల నుంచి వింటున్నాను. కానీ ఆయనను ఎప్పుడూ చూడలేదు. ఆయన వర్క్ చాలా ఇష్టం. నేను చాలా సీరియస్ వ్యక్తి అయి ఉంటాడని అనుకొన్నాను. కానీ ఇలా స్వీట్‌గా ఉంటానని అనుకోలేదు అని విజయ్ దేవరకొండ అన్నాడు.

    నర్స్ యూనిఫార్మ్‌లో శివన్నను చూశా

    నర్స్ యూనిఫార్మ్‌లో శివన్నను చూశా


    నేను ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడానికి కారణమైన శివకార్తీకేయన్ అన్న గురించి మాట్లాడాలి. ఆయనను ఎప్పుడూ కలువలేదు. ఇదే తొలిసారి శివన్నను కలవడం. కానీ.. ఎప్పటి నుంచో కలువాలని అనుకొంటున్నాను. నా పెళ్లి చూపులు రిలీజ్ అయిన తర్వాత ఒక నర్స్ యూనిఫార్మ్‌లో రెమో సినిమా హోర్డింగ్ చూశాను. అప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ వస్తున్నాను. కాలేజీ తర్వాత ఐదేళ్లు టీవీ రంగంలో చేశాడు. ధనుష్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేశాడు. స్టార్ హీరో అయ్యాడు. నిర్మాతగా మారాడు. లిరిక్స్ రాస్తాడు. ఎప్పడూ చూసిన నవ్వుతూ చాలా సంతోషంగా కనిపిస్తాడు..కానీ ఒక స్టేజ్ మీద ఏడుస్తూ కనిపించడం చాలా బాధ కలిగింది అని విజయ్ దేవరకొండ అన్నాడు.

    శివకార్తీకేయన్ ఏడుస్తూ కనిపించడంతో

    శివకార్తీకేయన్ ఏడుస్తూ కనిపించడంతో


    మేము ఒక సినిమాను మనసు పెట్టి చేస్తాం. ప్రాణంగా భావిస్తాం. అలాంటి సినిమా వేడుకలో శివకార్తీకేయన్ ఏడుస్తూ కనిపించడంతో నాకు చాలా బాధ కలిగింది. అప్పటి నుంచి నాకు ఓ బ్రదర్ మాదిరిగా కనిపించాడు. తెలుగు రాష్ట్రాల్లో అతడికి ఏదైనా చేయగలిగితే చేయాలనే ఫీలింగ్ కలిగింది. ప్రిన్స్ సినిమా 21న రిలీజ్ అవుతున్నది. నేను తప్పకుండా థియేటర్‌లో చూస్తాను. మీరు కూడా చూడండి అని విజయ్ దేవరకొండ అన్నాడు.

    English summary
    Vijay Deverakonda Heart felt speech about Sunil Narang and D Suresh and Anudeep Kv
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X