For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోయిన్‌తో కలిసి గోవా వెళ్తున్న విజయ్ దేవరకొండ.. షూటింగ్ కోసం కాదు సుమా.!

  By Manoj Kumar P
  |

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

   పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

  పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

  విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కథకు తగ్గట్లుగా విజయ్ తన బాడీ లాగ్వేజ్ మార్చుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  సొంత బ్యానర్‌పైనే

  సొంత బ్యానర్‌పైనే

  త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్‌లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపిన విషయం తెలిసిందే.

  టైటిల్ బయటికొచ్చేసింది

  టైటిల్ బయటికొచ్చేసింది

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేయించేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్‌లో జరగనున్నాయని, ఆ తర్వాత అంటే జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  ఎవరూ ఊహించిన పాత్రలో విజయ్

  ఎవరూ ఊహించిన పాత్రలో విజయ్

  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. అది పూర్తయిన వెంటనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోడానికి ‘థాయ్‌లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్‌లోనే నడుస్తుందట. అందుకే దీనికి ‘ఫైటర్' అనే పేరు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

  హీరోయిన్‌తో కలిసి గోవాకు విజయ్

  హీరోయిన్‌తో కలిసి గోవాకు విజయ్

  ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉండడంతో పూరీ జగన్నాథ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మణిశర్మతో కలిసి గోవా వెళ్లనున్నాడట. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్ ఛార్మీ, విజయ్ కలిసి అక్కడకు చేరకుంటారని తెలుస్తోంది. ఆ సమయంలో మ్యూజిక్ సిట్టింగ్స్‌తో పాటు డైలాగ్స్‌ను విజయ్ దగ్గరుండి పర్యవేక్షించనున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

  పూరీ అంటే అది ఉండాల్సిందే

  పూరీ అంటే అది ఉండాల్సిందే

  పూరీ జగన్నాథ్ సినిమా అంటే బీచ్ కంపల్సరీ అయిపోయింది. ఆయన తన ప్రతి సినిమాలో ఓ బీచ్ సాంగ్‌ను పెడతాడు. అంతేకాదు, స్టోరీ రాసుకోడానికి గోవా, బ్యాంకాక్, మాల్దీవులు సహా ఎన్నో ప్రదేశాలకు వెళ్తుంటానని గతంలో పూరీనే స్వయంగా వెల్లడించాడు. ఇందులో భాగంగానే విజయ్ సినిమా కోసం పూరీ అండ్ కో గోవా వెళ్లబోతుందని టాక్.

  English summary
  Vijay Devarakonda’s career graph skyrocketed with Arjun Reddy. The film was a massive success and he went on to become the hottest star in Tollywood. According to the latest buzz doing rounds, veteran filmmaker Puri Jagannath is planning to make a film with Vijay Devarakonda.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X