విజయ్ దేవరకొండ చేయూత.. గోల్డ్ మెడల్ సాధించిన యువ కిక్ బాక్సర్

హీరో విజయ్ దేవరకొండ సినీ పరిశ్రమలో తనకు తాను స్థిరపడుతూనే ఎందరో యువ టాలెంట్‌కు ప్రోత్సాహం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సేవాభావం కేవలం సిని పరిశ్రమకే పరిమితం కాకుండా క్రీడా రంగానికి కూడా చేయూతనివ్వడం అందర్నీ ఆకట్టుకొంటున్నది. దేవరకొండ ఫౌండేషన్ స్థాపించి పలువురికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

తాజాగా మెదక్ జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారీ పేదరికం బాధపడుతున్నారని తెలుసుకొన్న ఫౌండేషన్ నిర్వాహకులు యువ క్రీడాకారుడిని చేరదీశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌కి ఆర్థిక సహాయం అందించారు.

 Vijay Deverkonda Financial help for Kick Boxer Ganesh Embari

దేవరకొండ ఫౌండేషన్‌ నుంచి ఫిబ్రవరి 1వ తేదీన రూ.24 వేలు ఆర్థిక సహాయం అందుకొన్న గణేష్ ఎంబారీ ఫిబ్రవరి 13న జరిగిన క్రీడాపోటీలో సత్తా చాటాడు. ఈ పోటీలో ఏకంగా బంగారు పతకాన్ని సాధించారు. దాంతో యువ క్రీడాకారుడు గణేష్‌ను విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు అభినందించారు.

 Vijay Deverkonda Financial help for Kick Boxer Ganesh Embari

యువ టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహించే విజయ్ దేవరకొండ వల్లే తాను క్రీడాపోటీలో రాణించాను. ఆయన సహాయం అందించడం వల్లే ఢిల్లీకి వెళ్లి క్రీడా పోటీలో పాల్గొనడమే కాకుండా గోల్డ్ మెడల్ సాధించాను అని గణేష్ ఎంబారీ సంతోషం వ్యక్తం చేశారు.

 Vijay Deverkonda Financial help for Kick Boxer Ganesh Embari

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X