తెలుగులో రికార్డ్ క్రియేట్ చేసిన ‘మాస్టర్’: విజయ్‌కు ఈ రేంజ్ రావడానికి మహేశే కారణం

విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటోన్న అతడు.. ఒకదాని తర్వాత ఒక సినిమాను ప్రకటిస్తూ సత్తా చాటుతున్నాడు. పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తన ప్రతి సినిమానూ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'మాస్టర్' అనే సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీతో టాలీవుడ్‌లో రికార్డు క్రియేట్ చేశాడు విజయ్.

'అల్లుడు అదుర్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్: స్టైలిష్ లుక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)

'ఖైదీ' ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం 'మాస్టర్'. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీని విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ దీనికి మంచి స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను ఏకంగా 650 థియేటర్లలో విడుదల చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత మహేశ్ కోనేరు.

Vijay Master Movie Release Highest Number of Theaters in Telugu States

తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకుని.. తన ఈస్ట్ కోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ఆయన.. ఇప్పటికే తగినంత ప్రమోషన్‌ను కూడా అందించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక, ఎక్కువ థియేటర్లలో విడుదల అవుతోన్న తొలి డబ్బింగ్ సినిమాగా ఇది రికార్డులకెక్కింది. దీనికి కారణం నిర్మాత మహేశే అని ప్రత్యకంగా చెప్పనక్కలర్లేదు.

కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన 'మాస్టర్'లో విజయ్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. మాలవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు విశేషమైన ఆదరణ లభించింది. ఈ సినిమా ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X