రేడియో మాధవ్‌గా విజయ్ సేతుపతి.. ఏప్రిల్ 13న రిలీజ్
విజయ్ సేతుపతి నటించిన మార్కోని మతాయ్ చిత్రం మలయాళంలో భారీ హిట్‌ను సాధించిన విషయం తెలిసిందే. సినీ విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ చిత్రాన్ని రేడియో మాధవ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి గుండపూడి శ్రీను సమర్పకుడిగా, లక్ష్మీ చెన్నకేశవ ఫిల్మ్స్ అధినేతడీవీ కృష్ణస్వామి , నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మాత డివి కృష్ణష్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎన్. శ్రీనివాసమూర్తి, భాషా శ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేడియో మాధవ్ చిత్రాన్ని ఏప్రిల్ 23 తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

రేడియో మాధవ్‌గా విజయ్ సేతుపతి, మరో కీలక పాత్రలో జయరాం నటించారు. ఇది ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. విజయ్ సేతుపతి పాత్ర అందర్ని ఆకట్టుకొంటుంది. బిచ్చగాడుకు మాటలు, పాటలు అందించిన భాష శ్రీ అద్బుతంగా మరోసారి ఆకట్టుకోబోతున్నాడు అని నిర్మాత డివి కృష్ణష్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎన్. శ్రీనివాసమూర్తి అన్నారు.
మలయాళంలో స్టార్ హీరో జయరాం మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులతో విడదీయలేని అనుబంధం ఉంది. నేను నటించిన తెనాలి, పంచతంత్రం, భాగమతి, అల వైకుంఠపురం చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలాగే మార్కోని మతాయ్‌ని రేడియో మాధవ్‌గా రిలీజ్ చేస్తున్నారనే విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అన్నారు.
నటీనటులు: విజయ్ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు
సమర్పణ: గుండేపూడి శీను,
మాటలు, పాటలు: భాష్య శ్రీ,
ఎడిటింగ్: షామీర్ ముహమ్మెద్
కెమెరా: సజన్ కలతిల్
సంగీతం: ఏం జయచంద్రన్,
పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. శ్రీనివాసమూర్తి,
సహ నిర్మాత: డి.వి. చలం
నిర్మాత: డివి కృష్ణస్వామి
కథ, దర్శకత్వం: సనల్ కలతిల్


Click it and Unblock the Notifications











