twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vijayanand Trailer reivew అతిసాధారణ వ్యక్తి 4300 వాహనాలకు ఓనర్‌గా.. విజయానంద్ బయోపిక్ ట్రైలర్ రివ్యూ

    |

    వీఆర్ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిషికా శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బమోపిక్ విజయానంద్. ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారవేత్త, విజయానంద్ రోడ్ లైన్స్ (వీఆర్ఎల్) అధినేత డాక్టర్ విజయ్ సంకేశ్వర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను బెంగళూరులో ఆవిష్కరించారు. ఈ సినిమా కథ, విజయానంద్ ట్రైలర్ గురించిన వివరాల్లోకి వెళితే..

    విజయానంద్ సినిమా కథ విషయానికి వస్తే.. కర్ణాటకలోని గడగ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ప్రారంభించి.. దేశంలోనే టాప్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థకు రారాజుగా నిలిచిన వ్యక్తి విజయ్ సంకేశ్వర్. దేశవ్యాప్తంగా విస్తరించిన ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌లో ఆయన దాదాపు 4300 వాహనాలకు యజమానిగా నిలిచారు. అయితే ఈ కథ విషయానికి వస్తే.. తాను విస్తరించిన ప్రింటిగ్ బిజినెస్ కాదని.. తెలియని ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలోకి తన కొడుకు అడుగుపెట్టడం బాధను కలిగిస్తుంది. అయితే తాను ఊహించినట్టు కాకుండా తన వ్యాపారంలో అభివృద్ది సాధించి పారిశ్రామికవేత్తగా మారడం ఈ కథలో మలుుపు. కేవలం ట్రాన్స్‌పోర్టు బిజినెస్ కాకుండా మీడియాలోకి అడుగుపెట్టి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం కథలో విశేష అంశం.

    ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సాధించకుండా చస్తే..చావుకే అవమానం. సిద్దాంతాలు లేకుండా బతికితే బతుకుకే అవమానం అనే డైలాగ్‌తో ఎమోషనల్‌గా ట్రైలర్ కనిపించింది. తన బిజినెస్‌లో ప్రత్యర్థుల నుంచి అవమానాలు, బెదిరింపులను ఎదుర్కోవడం విజయ్ సంకేశ్వర్ కథను చెప్పింది. ప్రత్యర్థులు దాడులను ఎదుర్కొంటూ.. కర్ణాటక ప్రజలకు నా సహకారం.. దిన పత్రికను ప్రారంభిస్తున్నట్టు చెప్పడం ఈ కథలో కనిపిస్తుంది. దిన పత్రికను 1 రూపాయికే అమ్మాలని సంచలన నిర్ణయం తీసుకొంటాడు. ఇలా ప్రతికూల పరిస్థితుల మధ్య మీడియాలోను, ట్రాన్స్‌పోర్టులో ఎలా రాణించాడనేది స్పూర్తిదాయకమైన సినిమా కథగా విజయానంద్ కనిపించింది.

    Vijayanand Trailer reivew: Vijay Sankeshwar biopic looks inspirational on Silver Screen

    విజయానంద్ సినిమా సాంకేతిక విషయాలకు వస్తే.. గోపి సుందర్ సంగీతం బాగుంది.అలాగే ట్రైలర్‌లో డైలాగ్స్ కూడా ఆకట్టుకొన్నాయి. కీర్తన్ పూజారీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. టెక్నికల్‌గా ట్రైలర్ అందర్నీ ఆకట్టుకొనేలా ఉందని చెప్పవచ్చు.

    నటీనటులు: శ్రీ అనంత్ నాగ్, నిహాల్, భరత్ బొప్పన్న, సిని ప్రహ్లాద్, వినయ్ ప్రసాద్, ప్రకాశ్ బెలవాడీ, వీ రవిచంద్రన్ తదితరులు
    బ్యానర్: వీఆర్ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్
    నిర్మాత: డాక్టర్ ఆనంద్ సంకేశ్వర్
    సమర్పణ: ఆనంద్ సంకేశ్వర్
    రచన: దర్శకత్వం: రిషికా శర్మ
    మ్యూజిక్: గోపి సుందర్ సీ
    సినిమాటోగ్రఫి: కీర్తన్ పూజారీ
    డైలాగ్స్: కేఎన్ విజయ్ కుమార్
    ఎడిటింగ్: హేమంత్ కుమార్ డీ
    రిలీజ్ డేట్: 2022-12-09

    English summary
    VRL Transport Owner Vijay Sankeshwar's biopic is coming as Vijayanand. This movie tralier lanuched at Bangalore recently. Here is the Trailer review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X