For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి అలా అనడం.. మెగాస్టార్ కామెంట్స్‌పై విజయశాంతి రియాక్షన్! ఓపెన్ స్టేట్‌మెంట్

  |

  ఇటీవలే జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత తన కో-స్టార్ విజయశాంతితో ఓకే వేదికపైకి చేరుకోవడంతో ఎక్కువసేపు ఆమె గురించే మాట్లాడారు మెగాస్టార్. లేడీ అమితాబ్‌, లేడీ సూపర్‌స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ తెగ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్‌పై రియాక్ట్ అయింది విజయశాంతి. వివరాల్లోకి పోతే..

  గ్రాండ్ ఈవెంట్.. చిరంజీవి ఫోకస్

  గ్రాండ్ ఈవెంట్.. చిరంజీవి ఫోకస్

  అశేష అభిమానవర్గం నడుమ ఎంతో గ్రాండ్‌గా జరిగింది సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రావడంతో మెగా, సూపర్ స్టార్ అభిమానులతో కిక్కిరిసిపోయింది హైదరాబాద్ ఎల్బీ స్టేడియం. అయితే ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి ఎక్కువ ఫోకస్ విజయశాంతి మీదనే పట్టడం అందరికీ ఆసక్తి కలిగించింది.

  సినిమా.. పాలిటిక్స్ ఇంకా మరెన్నో

  సినిమా.. పాలిటిక్స్ ఇంకా మరెన్నో

  ఈ సందర్భంగా విజయశాంతితో తన సినీ ప్రయాణం, ఆ తరువాత పాలిటిక్స్‌లో వైరం.. ఇలా ఎన్నో విషయాలను నెమరు వేసుకుంటూ ఆమెతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడారు చిరంజీవి. పైగా విజయశాంతిపై అదే పొగరు, అదే ఫిగరు అంటూ ఘాటుగా పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో చిరంజీవి స్పీచ్ హాట్ టాపిక్ అయింది.

  అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలు

  అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలు

  తాజాగా తనపై చిరంజీవి చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించింది విజయశాంతి. ''నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే... కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డమ్‌ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం'' అని ఆమె తెలిపింది.

  చిరంజీవి అలా అనడం..

  చిరంజీవి అలా అనడం..

  జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో... నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను "గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక" అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా.. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా.. ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను అని పేర్కొంది విజయశాంతి.

  ఆ అవకాశం కల్పించిన మహేష్ బాబుకు

  ''సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్‌లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. `సరిలేరు నీకెవ్వరు` దర్శకుడు రావిపూడి గారితో పాటు మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని తన సందేశం పోస్ట్ చేసింది విజయశాంతి.

  సరిలేరు నీకెవ్వరు.. విజయశాంతి

  సరిలేరు నీకెవ్వరు.. విజయశాంతి

  `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి.. 'భారతి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

  English summary
  Sarileru Neekevvaru Pre Release Event done at Hyderabad. Chiranjeevi Is Chief Guest For Sarileru Event. Mahesh Babu, Rashmika Mandanna, Vijayashanthi also attended. In this event Chiranjeevi commented Vijayashanthi. Now Vijayashanthi reacted with Chiranjeevi Comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X