For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  విక్రమ్ ‘సామి’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. మరోసారి కీర్తి సురేష్..

  By Rajababu
  |

  పదిహేనేళ్ల కిందట తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది 'సామి'. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'సామి స్క్వేర్'ను రూపొందించారు. ఈ చిత్రం తెలుగులో 'సామి' అనే టైటిల్‌తో సెప్టెంబర్ మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ హీరోగా, 'సింగం, సింగం 2 , సింగం 3 , పూజా' వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం 'సామి'.

  శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు. పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు రెడీగా ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు.

  Vikrams saamy releasing on September Third week

  ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా దర్శకుడు, హీరోలైన హరి, విక్రమ్‌ల కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. వాళ్లిద్దరిదీ పవర్ ఫుల్ కాంబినేషన్. 15 సంవత్సరాల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'సామి' చిత్రం ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'సామి స్క్వేర్' చిత్రాన్ని తెలుగులో 'సామి'గా విడుదల చేస్తున్నాము.

  విక్రమ్ సరసన 'మహానటి' కీర్తిసురేష్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అలవోకగా అందుకుంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ అటువంటిది. రాక్‌స్టార్ దేవిశ్రీ మ్యూజిక్, ప్రియన్-వెంకటేష్ అంగురాజ్‌ల సినిమాటోగ్రఫీ, కనల్ కణ్ణన్ ఫైట్స్.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

  Vikrams saamy releasing on September Third week

  ప్రస్తుతం సెన్సార్‌కు వెళుతున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని సెప్టెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్రం కూడా అందరినీ మెప్పించి, అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని ఎంతో నమ్మకంతో ఉన్నాము'' అన్నారు.

  English summary
  Film-maker Hari, known for his fast-paced action movies, enraptured the Kollywood audience during the audio launch of Iru Mugan in August 2016, by announcing his collaboration with Chiyaan Vikram yet again for a sequel to Saamy after a long gap of 13 years. This film is set release in September third week as Saamy in Telugu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more