For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ginna Twitter Review: జిన్నాకు ఊహించని టాక్.. శృంగార తార హైలైట్‌గా.. మంచు విష్ణు హిట్ కొట్టాడా?

  |

  మంచు మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు విష్ణు. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. కొంత కాలంగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత విష్ణు 'జిన్నా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో చూడండి!

  జిన్నాగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు

  జిన్నాగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు

  మంచు విష్ణు నటించిన తాజా చిత్రమే 'జిన్నా'. ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా చేశారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు స్వయంగా నిర్మించాడు. దీనికి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఎంతో మంది కీలక పాత్రలను పోషించారు.

  Ori Devuda Twitter Review: విశ్వక్ మూవీకి అలాంటి టాక్.. వెంకటేష్ రోల్ ఇలా.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  మళ్లీ అదే పంథాలోకి వచ్చేసి

  మళ్లీ అదే పంథాలోకి వచ్చేసి

  మంచు విష్ణు నటించిన 'జిన్నా' మూవీ యాక్షన్ కామెడీ జోనర్‌లో వచ్చింది. దీనికి కొంచెం థ్రిల్ ఎలిమెంట్లను కూడా జోడించారు. సరదాగా సాగిపోతోన్న హీరో పాత్రకు అనుకోని కష్టాలు ఎదురు కావడం.. వాటిని అధిగమించేందుకు అతడు విశ్వ ప్రయత్నాలు చేయడం.. అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. దీనితో చాలా కాలం తర్వాత విష్ణు మళ్లీ యాక్షన్ కామెడీ జోనర్‌లోకి వచ్చాడు.

  ట్విట్టర్‌లో జిన్నాకు టాకెంటి

  మంచు విష్ణు నటించిన 'జిన్నా' మూవీ ఎన్నో అంచనాల నడుమ దీపావళి పండుగ కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్ సహా చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడిపోయాయి. దీంతో ట్విట్టర్ వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు. అయితే, కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు.

  జిన్నాకు నెటిజన్ రివ్యూ

  'జిన్నా' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ తాజాగా ట్విట్టర్ ఖాతాలో 'మంచు విష్ణు ఈ సినిమాలో సూపర్‌గా సరదాగా కనిపించాడు. కథ బాగానే ఉన్నా చాలా స్లోగా నడుస్తుంది. కానీ, విష్ణు.. సన్నీ లియోన్‌ను కలిసినప్పటి నుంచి కిక్ వస్తుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, మ్యూజిక్, డ్యాన్స్‌లు, బాగున్నాయి. విష్ణు డైలాగ్స్, స్వాగ్ బాగుంది. క్లైమాక్స్ ఫైరింగ్‌గా ఉంది' అని ట్వీట్ చేశాడు.

  ఫన్ ఎంటర్‌టైనర్ అంటూ

  మంచు విష్ణు నటించిన 'జిన్నా' మూవీని చూసిన అదే నెటిజన్ ప్లస్‌లు మైనస్‌ల గురించి వివరించాడు. 'జిన్నా మూవీలో విష్ణు నటనపై గర్వంగా ఉంది. సన్నీ లియోన్ ఎంతో అందంగా కనిపించింది. పాయల్ రాజ్‌పుత్ పాత్ర కూడా బాగుంది. సంగీతం, కామెడీ, డ్యాన్స్ బాగున్నాయి. కానీ, ఫస్టాఫ్ సాగదీసినట్లుగా అనిపించింది' అంటూ ట్వీట్‌ ద్వారా చెప్పుకొచ్చాడు.

  విష్ణు మంచి పని చేశాడని

  'జిన్నా' సినిమాను వీక్షించిన మరో నెటిజన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అందులో 'ఇప్పుడే జిన్నా మూవీని చూశాను. ఢీ మూవీలో మాదిరిగా విష్ణు కామెడీ టైమింగ్‌తో వచ్చాడు. సన్నీ లియోన్ కోసం వెళ్లే వాళ్లు సంతృప్తి చెందుతారు. హర్రర్ కామెడీని ఎంచుకుని విష్ణు మంచి పని చేశాడు. టాక్‌ను బట్టి సినిమా నడుస్తుంది' అని రాసుకొచ్చాడు.

  సన్నీ లియోన్‌ గురించే

  మంచు విష్ణు నటించిన 'జిన్నా' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అందులో సన్నీ లియోన్ గురించి చెబుతూ.. 'జిన్నా మూవీలో సన్నీ లియోన్ ఫైరింగ్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ షాకిస్తుంది. సాంగ్స్ అండ్ డ్యాన్స్ బాగున్నాయి. సన్నీ కోసం అనూప్ ఇచ్చి బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది' అంటూ వెల్లడించాడు.

  సినిమాపై ట్రోల్స్ కూడా

  సినిమాపై ట్రోల్స్ కూడా

  సాధారణంగా మంచు విష్ణు సినిమా అంటే ట్రోల్స్ వస్తుంటాయి. ఈ క్రమంలోనే 'జిన్నా' మూవీపై ఓ నెటిజన్ 'జిన్నా ఏమి ఎక్స్‌పీరియన్స్. సినిమా మొత్తం ప్రశాంతంగా నిద్రపోయాను. అందుకు గానూ యూనిట్‌కు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరినీ థియేటర్లలో నిద్రపోయేలా చేసిన మంచు విష్ణు. ఫైనల్‌గా స్లీప్ వెల్' అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు.

  English summary
  Vishnu Manchu Did Ginna Movie Under Eeshaan Suryaah Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X