'విశ్వామిత్ర' శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రమఖ ఛానల్

నందితా రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'విశ్వామిత్ర'. గీతాంజలి, త్రిపుర వంటి హిట్ హారర్ థ్రిల్లర్స్ తర్వాత రాజ్‌ కిరణ్ దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్నారు.

'విశ్వామిత్ర' శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఎంటర్టెన్మెంట్ ఛానల్ వారు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. రాజ్‌ కిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలి, త్రిపుర చిత్రాలు మంచి విజయం సాధించడంతో అతడి డైరెక్షన్ మీద నమ్మకంతో 'విశ్వామిత్ర' రైట్స్ సదరు ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Viswamitra movie has sealed a lucrative satellite deal

రాజ్‌ కిరణ్ మాట్లాడుతూ "రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం చేశాం. న్యూజీలాండ్‌, అమెరికాలో నిజంగా జరిగిన సంఘటనల నేపథ్యంతో కథ తయారు చేశాను. సృష్టిలో జరిగే విషయాలను మనుషులు అంచనా వేయలేరు. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ రేటు రావడం సంతోషంగా ఉంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అన్నారు.

ఈ చిత్రంలో 'సత్యం' రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, కార్టూనిస్ట్ మల్లిక్, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ ముఖ్య తారాగణం.

ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ, ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర - భాను, ఆర్ట్: చిన్నా, కో-డైరెక్టర్: విజయ్ చుక్కా, పి.ఆర్.ఓ: నాయుడు - ఫణి, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజ్‌ కిరణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజ్‌ కిరణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X