Just In
- 14 min ago
స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగశౌర్య: ‘వరుడు కావలెను’ నుంచి సర్ప్రైజింగ్ వీడియో
- 34 min ago
టాలీవుడ్ యంగ్ హీరోతో ఆరియానా రచ్చ: త్వరలోనే భారీ సర్ప్రైజ్.. జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ!
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
Don't Miss!
- Sports
ISL 2020 21: చివరలో విలియమ్స్ గోల్.. మోహన్ బగాన్‌కు మరో విజయం!!
- News
కరోనా అప్డేట్ : తెలంగాణలో కొత్తగా 214 కేసులు... దేశంలో కొత్తగా 14,545 కేసులు
- Finance
PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు
- Lifestyle
Republic Day 2021 : రిపబ్లిక్ డే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసమే...!
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లవ్‌స్టోరీ గుట్టు విప్పిన వైవా హర్ష.. అమ్మాయి ఇంట్లో చెప్పగానే భయపడ్డారు.. చివరికి అలా ఒప్పించాను
వైవా హర్ష అంటే తెలియని నెటిజన్లు ఉండరు. సోషల్ మీడియా నుంచి బిగ్ స్క్రీన్ వరకు అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న వైవా హర్ష తన డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నాడు. ఇక మనోడు త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు ఇటీవల ఎంగేజ్మెంట్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే ఆమె ఎవరు? ఎలా పరిచయం అయ్యిందనే విషయాలని కూడా బయటపెట్టాడు.

అక్షరతో ఎంగేజ్మెంట్..
వైవా హర్ష యూ ట్యూబ్ లో మొదట కామెడీ స్కిట్స్ ద్వారా గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ అలాగే సినిమాలతో కూడా తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. ఇక ఇటీవల అక్షర అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వేడుకలో మెగా బంధువులు
మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్ బ్రదర్స్ మనోడికి చాలా మంచి స్నేహితులు. ఇక వారు ఎంగేజ్మెంట్ కు కూడా వచ్చారు. మెగా డాటర్ సుస్మిత కూడా నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్నారు. ఆమె భర్త విష్ణు ప్రసాద్ కూడా వచ్చారు. ఇక సుస్మిత కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో హర్ష నటిస్తున్నాడు.

లవ్‌స్టోరీ గుట్టు విప్పిన హర్ష
ఇక హర్ష తనకు కాబోయే భార్య అక్షర గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వడమే కాకుండా తన లవ్ స్టోరీని కూడా బయటపెట్టాడు. హర్ష మాట్లాడుతూ.. పీజీ చదివిన అక్షర నాకు నాలుగేళ్లుగా తెలుసు. ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన అక్షర మొదట్లో నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్. అయితే ఆ స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది.. అని చెప్పాడు.
Kingfisher Calendar 2021 Superhot Model Photos

ప్రపోజ్ చేయగానే..
రెండేళ్ల క్రితమే మేము ఒకరినొకరం మరింత అర్థం చేసుకొని ప్రేమించుకున్నాం. మొదట్లో అక్షరకు నేను ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఇక నా తల్లిదండ్రులు సత్యనారాయణ రావు, రామదేవి ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరగానే ఒప్పేసుకున్నారు.

వాళ్ళ డాడీ భయపడ్డారు
కానీ అక్షర వాళ్ళ ఇంట్లో చెప్పగానే మొదట ఒప్పుకోలేదు. అక్షర తండ్రి గౌరీ శంకర్ కాస్త సమయం తీసుకొని ఆలోచించరు. ఆయనతో విషయం చెప్పేవరకు కూడా అక్షర నా గురించి ముందే చెప్పకపోవడంతో కొంత భయపడ్డారు. అక్షర అమ్మకు మాత్రమే మా విషయం తెలుసు. అందుకే ఆలోచించడానికి నిర్ణయం తీసుకున్నారు.

వాళ్ల నాన్న అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
అయితే పెళ్లి ప్రపోజల్ తరువాత ఒకసారి నేను అక్షర వాళ్ళ నాన్నతో కొంత సమయాన్ని గడిపాను. అప్పుడు వారు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు. వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నిశ్చితార్థం వేడుకలో అక్షర ఫాదర్ ఎమోషనల్ అయ్యారు అని వైవా హర్ష పూర్తిగా తన లవ్ స్టొరీ గురించి చెప్పేశాడు.

పెళ్లి ఎప్పుడంటే..
అలాగే పెళ్లిపై కూడా వైవా హర్ష ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం తన సోదరి లాస్ ఏంజిల్స్ లో ఉందని అంటూ ఆమె వచ్చిన తరువాత జూన్ లేదా జులై నెలలో పెళ్లి జరుగుతుందని చెప్పేశాడు. ఇక అక్షరతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని చాలా ఆతృతగా ఉన్నట్లు కూడా హర్ష సరదాగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆహా యాప్ కూడా హర్ష తమాషా అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.