For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  VK Naresh ముగ్గురు భార్యలు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

  |

  గత కొద్దిరోజులుగా నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తొలుత తెలుగు మీడియాలో వారిద్దరూ వివాహం చేసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. తరువాత అది నిజం కాదని ఇప్పటికే వారు వివాహం కూడా చేసుకున్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తరువాత లేదని వారు సహజీవనం మాత్రమే చేస్తున్నారని కూడా విభిన్న కోణాలలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కన్నడ మీడియా ముందు సంచలన ఆరోపణలు చేయడం ఆ తర్వాత నరేష్, పవిత్రలను మైసూర్ హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఈ వివాదం పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇదిలా ఉండగా అసలు నరేష్ మొదటి ఇద్దరు భార్యలు? ఎవరు వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ విషయాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

  సొంత బిడ్డలాగే

  సొంత బిడ్డలాగే

  సూపర్ స్టార్ కృష్ణ ముందు తనకు మేనకోడలు వరుసయ్యే పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా ఆయనకు ఐదుగురు సంతానం కలిగారు. ఆ తర్వాత విజయనిర్మలతో కలిసి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో అప్పటికే వివాహమై మొదటి భర్తకు దూరమైన విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే విజయనిర్మలకు తన మొదటి భర్త కారణంగా కలిగిన సంతానమే నరేష్.. తనకు కృష్ణకు ఉన్న ప్రేమకు గుర్తుగా విజయనిర్మల నరేష్ కు విజయకృష్ణ నరేష్ అనే పేరు పెట్టుకున్నారు.

  మొదటి భార్య ఎవరంటే?

  మొదటి భార్య ఎవరంటే?


  కృష్ణ కూడా నరేష్ ను తన సొంత బిడ్డలాగే చూసుకునేవారని అంటూ ఉంటారు. అలా 1972 వ సంవత్సరంలో పండంటి కాపురం అనే సినిమాతో నరేష్ బాలనటుడిగా సినీ తెరంగ్రేటం చేశాడు. తరువాత 1982 అంటే సుమారు 10 ఏళ్ల తర్వాత విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ సంకెళ్లు అనే సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే విజయనిర్మల టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను అనే ఆయన కుమార్తెతో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు.

  రెండో భార్య ఎవరంటే?

  రెండో భార్య ఎవరంటే?

  అయితే ఈ దంపతులకు నవీన్ విజయ్ కృష్ణ అనే కుమారుడు జన్మించాడు. కుమారుడు జన్మించిన సమయంలోనే నరేష్ మొదటి భార్య అనారోగ్యం పాలయ్యారు. దీంతో నరేష్ ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నరేష్ ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనమరాలైన రేఖ సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి కూడా పెద్దలు అంగీకారం తెలిపారు వీరికి కూడా ఒక కుమారుడు జన్మించాడు. కానీ వీరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. భార్యాభర్తలుగా విడిపోయినా ఒక ఎన్జీవో కోసం ఇప్పటికీ వీరు కలిసి పనిచేస్తూ ఉంటారు..

  మూడో భార్య ఎవరంటే?

  మూడో భార్య ఎవరంటే?


  ఇక ఆ తర్వాత విజయనిర్మల వద్ద దర్శకత్వం మెళుకువలు నేర్చుకోవడం కోసం రమ్య రఘుపతి అనే ఒక యువతి వచ్చి చేరారు. అప్పటికి నరేష్ వయసు సుమారు 50 పైనే అయిన అప్పటికే 30 ఏళ్ల లోపు వయసున్న రమ్యరఘుపతి ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నయ్య కుమార్తె. వీరి వివాహం జరిగిన తర్వాత వీరిద్దరికీ కూడా ఒక బాబు జన్మించాడు.

  వివాదం అలా

  వివాదం అలా


  కానీ వీరిద్దరూ కూడా రెండేళ్లు మించి కాపురం చేయలేకపోయారు. దీంతో అప్పటినుంచి విడివిడి గానే బతుకుతున్నారు. అయితే నరేష్ తన కుమారుడి ఆలనా పాలనా కోసం నెలకు 70 వేల రూపాయలు ఇప్పటికీ పంపిస్తూ ఉంటారని నరేష్ సన్నిహితులు చెబుతూ ఉంటారు. సుమారు నెలన్నర రోజుల క్రితం నరేష్ భార్య రమ్య రఘుపతి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని చీటింగ్ చేసిందంటూ పెద్ద ఎత్తున వివాదం చాలా రేగింది, ఈ వివాదం తరువాత నరేష్ ఆమెకు విడాకుల నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ వ్యవహారాన్ని తెరమీదకు తీసుకు వచ్చిన రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం పెట్టారని ఆయనకు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని మీడియా ముందుకు వచ్చారు. ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  here are the full details about actor VK Naresh 3 Marriages, Everything You Need To Know About His 3 Marriages Story is given in detailed
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X