Waltair Veerayya మేకపిల్లను ఎత్తుకొన్న పులిలా.. ఎవడి అయ్యాకు వినను అంటూ రవితేజ ఫస్ట్ లుక్ క్రేజీగా!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రవితేజ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ఎలా ఉందో మీరే చూడండి..

మాస్ ఎంట్రీతో రవితేజ

మాస్ ఎంట్రీతో రవితేజ


వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ మంచి ఎనర్జీతో కనిపించింది. మాస్ మహారాజ్ ఫాలోయింగ్ కు తగినట్టుగానే రవితేజ్ ఎంట్రీ మాస్ గా టీజర్ లో కనిపించింది. మేకపిల్లను ఎత్తుకొని కనిపించగానే.. ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తున్నది అంటూ వాయిస్ ఓవర్ వినిపించింది. మంచి యాక్షన్ సీక్వెన్స్'తో రవితేజ టీజర్ లో కనిపించాడు.

పిస పిస చేస్తున్నావేంటి? అంటూ

పిస పిస చేస్తున్నావేంటి? అంటూ


ఇక ఏందిరా వారి.. పిస పిస చేస్తున్నావు.. నీకు ఇంకా సమజ్ కాలేదా? నేను ఎవరి అయ్యకు విననని అంటూ మాస్ మహారాజా తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చాడు. చేతిలో గ్యాస్ సిలండర్, భుజం మీద మేకపిల్లతో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో నిజాయితీపరుడైన, డాషింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఏసీపీ విక్రమ్ సాగర్'గా రవితేజ కనిపించబోతున్నారు.

ఫైట్ సీక్వెన్స్ లో టెర్రిఫిక్‌ గా

ఫైట్ సీక్వెన్స్ లో టెర్రిఫిక్‌ గా


రవితేజకు ఉన్న ఫాలోయింగ్ కు తగినట్టుగానే దర్శకుడు బాబీ.. ఏసీపీ విక్రమ్ సాగర్ కు మంచి బిల్డప్ షాట్స్, ఎలివేషన్స్'తో ఎంట్రీ ఇప్పించాడు. రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫి చేసిన యాక్షన్ సీన్లలో రవితేజ చెలరేగిపోయాడు. ఫైట్ సీక్వెన్స్ లో టెర్రిఫిక్‌ గా కనిపించాడు. ఓవరాల్‌ రవితేజను మాస్ లుక్ లో అభిమానులు కోరుకొనే విధంగా చూపించాడు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందనేలా ఉంది.

జనవరి 13న రిలీజ్


మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేనీ, రవిశంకర్ రూపొందించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. జనవరి 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు బాబీ స్వయంగా మాటలు రాయగా.. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందించారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రచనా సహకారం అందించారు.

వాల్తేరు వీరయ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

వాల్తేరు వీరయ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, క్యాథరీన్ త్రెసా, బాబీ సింహ తదితరులు
కథ, డైలాగ్స్, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
డీవోపీ: ఆర్థర్ ఏ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమణే
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
సీఈవో: చెర్రీ
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2029-01-13

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X