వెంకీమామ పెట్టిన చిచ్చు.. తమిళ్-తెలుగు ప్రేక్షకుల మధ్య వార్.. జాతీయ స్థాయిలో చర్చ

తమిళ్ తెలుగు ప్రేక్షకుల మధ్య వార్ మొదలైంది. ఏ ఇండస్ట్రీలోనైనా ఫ్యాన్స్ వార్ సర్వసాధారణం. విజయ్-రజినీ-అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎంతటి యుద్ద వాతావరణం నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఇక్కడి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా నెలకొన్న పరిస్థితులే వాటికి ఉదాహరణ. తమ హీరోవి నిజమైన వసూళ్లు.. అవతలి వారివి ఫేక్ కలెక్షన్లు అని వాదనకు దిగుతున్న విషయం మనం చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

Victory Venkatesh Massive Look In Narappa | Asuran Vs Narappa | Tollywood Vs Kollywood
తాజాగా నారప్ప పోస్టర్స్..

తాజాగా నారప్ప పోస్టర్స్..

తమిళ నాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రానికి రీమేక్ నారప్పను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంకటేష్ లుక్‌ను రివీల్ చేశారు. వీటితో ఈ చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. తమిళంలో ధనుష్ గెటప్‌ను, చివరకు తలకు చుట్టుకున్న తలపాగా రంగును కూడా మార్చకుండా.. ఉన్నది ఉన్నట్లు పెట్టేశారు. అయితే నారప్ప గెటప్‌లో వెంకీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాడు. అయితే ధనుష్ లుక్, వెంకీ లుక్‌ను పోల్చుతూ మొదలైన ఈ వార్.. ఎక్కడికో వెళ్లిపోయింది.

తమిళ నటులకు సరిలేరు..

తమిళ నటులకు సరిలేరు..

అయితే తమిళ నటులను మ్యాచ్ చేసే వారెవరులేరని #UnrivalledTamilActors అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇది దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది. మనవాళ్లు అక్కడి సినిమాలను రీమేక్ చేసిన విషయాలను గుర్తు చేస్తూ.. విజయ్-పవన్ కళ్యాణ్ లుక్స్, అజిత్-ప్రభాస్ గెటప్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. మన హీరోలను కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

తెలుగు హీరోలే నిజమైన వాళ్లు..

తెలుగు హీరోలే నిజమైన వాళ్లు..

వీటికి ధీటుగా మన ప్రేక్షకులు కౌంటర్ వేస్తున్నారు. విజయ్ లుక్స్, పవన్ కళ్యాణ్ లుక్స్‌ను పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఫ్యామిలీ ప్యాక్, రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ వంటి ఫోటోలతో మీమ్స్ క్రియేట్ చేసి కౌంటర్లు వేస్తున్నారు. అక్కడి హీరోల విగ్గులు, మన హీరోల స్టైలింగ్స్‌ను పోల్చుతూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ మేరకు #TeluguRealHeroes అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ మాత్రమే అలా..

ఫ్యాన్స్ మాత్రమే అలా..

ఈ అనవసరపు పోలికలు, మాటల యుద్దాలు కేవలం అభిమానుల వరకే ఉంటాయని, రెండు ఇండస్ట్రీల మధ్య గానీ, హీరోల మధ్య అలాంటివి ఉండవని కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలుగు హీరోలు, తమిళ హీరోల గురించి గొప్పగా చెబుతారని, తమిళ హీరోలు..తెలుగు హీరోల గురించి గొప్పగా చెబుతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X