80's Stars union కు బాలకృష్ణ దూరం.. గైర్హాజరుకు కారణం అదే అంటూ..
దక్షిణాది సినీ పరిశ్రమలో 80వ దశకంలో రాణించిన స్టార్ హీరోలు, హీరోయిన్లందరూ ప్రతీ ఏటా రీ యూనియన్ అవ్వడం కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. షూటింగులు, ప్రొఫెషనల్, పర్సనల్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా గానీ వారంతా ఒక చోట అందరూ కలిసి పార్టీలు చేసుకొంటూ రిలాక్స్ అవుతారు. అయితే ఈ ఏడాది కూడా తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు స్టార్స్ అందరూ గోవాలో రీ యూనియన్ అయ్యారు. అయితే ఈ తారల భేటీకి నందమూరి బాలకృష్ణ దూరంగా ఉండటం అందరిలోను ఓ ప్రశ్న రేకెత్తింది. అయితే ఈ సమావేశానికి ఎందుకు ఆయన దూరం ఉన్నారనే వివరాల్లోకి వెళితే...
80's స్టార్ రీ యూనియన్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కుష్బూ, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్,మీనా, శరత్ కుమార్, సుహాసిని, వీకే నరేష్, భాను చందర్, సురేష్, ప్రభు, జయరాం, రేవతి, నదియా, జయసుధ, సుమలత, రాధతోపాటు దాదాపు 31 మంది స్టార్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. పులి చర్మం కాన్సెప్టుతో డ్రస్ కోడ్ విధించుకొన్నారు. అలా అందంగా ముస్తాబైన తారలందరూ తమ లుక్స్‌తో జిగేల్ మనేలా ఫోటోలకు ఫోజిచ్చారు.

అయితే ఈ తారల సమావేశంలో ఇంకా కొంతమంది స్టార్స్ కనిపించడకపోవడంతో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలోకి కనిపించాయి. అయితే ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో కనిపించలేదు. దాంతో వారు, ఇతర సభ్యులు ఎందుకు హాజరు కాలేదని కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే వారిద్దరూ రాకపోవడం వెనుక ప్రధాన కారణాలు ఇవే అంటూ చెప్పారు.
80s రీయూనియన్ వేడుకలకు దాదాపు రజనీ, బాలకృష్ణ దూరంగా ఉంటారు. వారు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా అరుదు. దాదాపు గతంలో ఎప్పుడైనా వచ్చి ఉంటారేమో అనే అనుమానాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేశాయి. అయితే రజనీకాంత్ మాత్రం తారల భేటికి దూరంగా ఉంటూ.. ఆయన రుషికేష్‌లో సేద తీరుతూ కనిపించారు. ఆయన సామాన్యుడిలా భోజనం చేస్తున్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అధ్యాత్మిక జర్నీలో ఉన్నారు. రుషికేష్‌లోని ఆశ్రమంలో స్థానికులతో కలిసి ఆకులో భోజనం చేస్తూ కనిపించడం.. ఆ ఫోటోలు ట్రెండ్ కావడం కనిపించాయి.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ఆయన తన వ్యక్తిగత పనులు, సినిమా షూటింగుల కారణంగా దూరంగా ఉన్నారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలకు సహజంగానే హాజరుకారు. అంతకు మించి బాలకృష్ణ రాకపోవడం వెనుక కారణమేమి లేదు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చిరంజీవితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నారనే వార్తలను ఖండించారు.
ఇదిలా ఉండగా, గోవాలో జరిగిన 80s స్టార్ రీ యూనియన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ప్రతీ ఏట మాదిరిగా హీరో, హీరోయిన్లందరూ కలిసి మెలిసి జోష్‌లో కనిపించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ అనుభూతులను పంచుకొంటూ కనిపించారు.


Click it and Unblock the Notifications











