Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ దేవరకొండ ఆ మాట అనడంతో చాలా హార్ట్ అయ్యా.. అందరి ముందే ఓపెన్ అయిన రాశి ఖన్నా
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు యంగ్ హీరోయిన్ రాశి ఖన్నాను చాలా హర్ట్ చేశాయట. ఆ మాటలు వినగానే తానిక్కదాన్నే కాదు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారని సభాముఖంగా అందరి ముందే ఓపెన్ అయింది. మరి ఇంతకీ విజయ్ ఏమన్నాడు? రాశీ ఎందుకు హర్ట్ అయింది? ఆ వివరాలేంటో చూద్దామా..

నలుగురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్
రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ఈ సారి ఆయనతో ఏకంగా నలుగురు హీరోయిన్లను రంగంలోకి దించి రొమాన్స్ చేయించారు డైరెక్టర్ క్రాంతి మాధవ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో విజయ్ సరసన నలుగురు అందాల భామలు రొమాన్స్ చేశారు.

విజయ్ దేవరకొండ రొమాంటిక్ కిక్.. యామినితో పాటు
అందులో ఒకరు రాశి ఖన్నా. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఈమె క్యారెక్టర్ పేరు యామిని. ఇక ఈమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా కూడా విజయ్ తో రొమాన్స్ పండించారు. ఈ నలుగురి రొమాంటిక్ కిక్ ఎలా ఉండనుందో ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ విడుదల కానుంది.

రాశిఖన్నా అనే కంటే యామిని అనేందుకే..
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. ఆదివారం రోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడిన రాశి ఖన్నా, విజయ్ మాటలకు తాను హర్ట్ అయ్యానని చెప్పింది. ప్రస్తుతం తనను చాలామంది రాశిఖన్నా అనే కంటే యామిని అని పిలవడానికే ఇష్టపడుతున్నారని ఆమె చెప్పింది.

నాకు అదే ఇష్టం.. అందుకే ఆతృతగా ఉంది
'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా గురించి చెప్పాలంటే ముందుగా లవ్ గురించి చెప్పాలి. మీరు లవ్ ఉన్నా లేకపోయినా చూడాల్సిన సినిమా ఇది. లవ్ అనేది అనేది యూనివర్శల్ ఎమోషన్. ఈ సినిమా కేవలం ప్రేమ కోసమే తీసింది. నాకు ప్రేమ కథలు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది రాశి.

విజయ్ మాటలకు చాలా హర్ట్ అయ్యా..
''ఇకపోతే ఇటీవలే జరిగిన వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో.. విజయ్ దేవరకొండ ఇదే తన చివరి లవ్ స్టోరీ అని చెప్పాడు. అంతేకాదు ఇక లవ్ స్టోరీస్ చేయను అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.. ఆ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను'' అని ఓపెన్‌గా చెప్పేసింది రాశిఖన్నా.

నో.. విజయ్ నువ్వు చేయాల్సిందే..
నువ్వు లవ్ స్టోరీస్ చేస్తే చూడాలని ప్రేక్షకుల కోరిక. కానీ నువ్వు అలా మాట్లాడే సరికి నాతో పాటు చాలామంది ఫ్యాన్స్ బాధపడ్డారు అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ మాట్లాడింది రాశిఖన్నా. నో.. విజయ్ నువ్వు లవ్ స్టోరీస్ చేయాలి. నేను కూడా లవ్ స్టోరీస్ చేస్తూనే ఉంటానని రాశి సభాముఖంగా చెప్పింది.