twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ మెగాఫోన్ పట్టిన మెగా రైటర్.. ఈసారి "నల్లంచు తెల్లచీర" అంటూ!

    |

    తెలుగు సాహిత్య రంగంలో యండమూరి వీరేంద్రనాథ్ అంటే తెలియనివారుండరు. ఆయన రచనలు ఇప్పటికీ చాలా పాపులర్. ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలు పరిసర ప్రాంతాల్లో జన్మించిన ఆయన చేయి తిరిగిన రచయిత గా పేరు సంపాదించారు. ఆయన సుమారు ముప్పై సినిమాలకు కథలు అందించారు. అలాగే చాలా సీరియల్స్ కి కూడా ఆయన నవలలు ఆధారంగా నిలిచాయి. మరీ ముఖ్యంగా ఒక ఊరి కథ అనే సినిమా అయితే ఏకంగా రాష్ట్రపతి నుంచి ఉత్తమ ప్రాంతీయ సినిమాగా అవార్డు కూడా దక్కించుకుంది. ఇక యండమూరి కలం నుంచి జాలువారిన ఓ నవల 'దొంగ మొగుడు' పేరుతో మెగాస్టార్ చిరంజీవితో రూపొంది అసాధారణ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన 'అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం, రాక్షసుడు" సినిమాలు కూడా ఆయన కలం నుంచి పుట్టినవే. ఇక యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "నల్లంచు తెల్లచీర". ఈ సినిమాని 'ఊర్వశి ఓటీటీ' సమర్పణలో.. సంధ్య స్టూడియోస్-భీమవరం టాకీస్ బ్యానర్ ల మీద రవి కనగాల- తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాని సి.అమర్ ఎక్సి క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.

    Yandamuri Veerendranath to direct nallanchu thella cheera

    "స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు" సినిమాలు తెరకెక్కించిన యండమూరి దర్శకత్వం నుంచి వస్తున్న నాలుగో సినిమా ఈ 'నల్లంచు తెల్లచీర' కావడం గమనార్హం. యండమూరి శైలిలోనే వినూత్నమైన కథ-కథనాలతో ముస్తాబవుతున్న ఈ "నల్లంచు తెల్లచీర" ఫస్ట్ లుక్ కూడా త్వరలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకి అమీర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మీర్ ఎడిటింగ్ చేస్తున్నారు. తాళ్ళూరి నాగరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమా కధ - స్క్రీన్ ప్లే-దర్శకత్వం అన్ని బాధ్యతలు యండమూరి వీరేంద్రనాధ్ చూసుకోవడం గమానార్హం.

    English summary
    Yandamuri Veerendranath is an Indian novelist and screenwriter known for his works in the Telugu language. as a director he directed few films, he announced his new film nallanchu thella cheera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X