#Yash19 : నెవర్ బిఫోర్ రోల్.. అందరిలో అదే ఆసక్తి.. ఇప్పటి నుంచే ట్రెండింగ్!

కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కన్నడ స్టార్ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా కన్నడ సినిమా ఖ్యాతిని ఇండియా మొత్తం చాటిచెప్పింది. ప్రస్తుతం యష్ కేజిఎఫ్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి సినిమా షూటింగులు జరగకపోయినా షూటింగ్ లు త్వరలోనే మొదలు అవుతాయి. అలా ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన నర్తన్ అనే దర్శకుడి దర్శకత్వంలో తన 19వ సినిమా తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏమి లేకపోయినా సరే చాన్నాళ్ల నుంచీ ఈ కాంబినేషన్ గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో యష్ నటించే పాత్ర ఇదేనంటూ ఒక ప్రచారం మొదలైంది. ఆ ప్రచారం మేరకు యష్ నర్తన్ తెరకెక్కించబోతున్న సినిమాలో ఒక యాంగ్రీ, పవర్ఫుల్ నేవీ ఆఫీసర్ రోల్ లో నటించబోతున్నాడని సమాచారం. ఇది పూర్తిగా ఎంగేజింగ్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వీలైనంత త్వరగా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Yash to play a Navy Officer role in director Narthans next

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటి నుంచే ఈ సినిమా ట్రెండ్ సృష్టిస్తోంది. ప్రస్తుతానికి ఈ #Yash19 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని కోరుతూ ట్విట్టర్ వేదికగా యష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కేజిఎఫ్ 2 సినిమా కూడా ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్న యష్ ఫ్యాన్స్ ఆ తర్వాత 19 సినిమా ఉంటుందని దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మధ్య కాలంలో యష్ సినీ కార్మికులు అందరికీ ఐదువేల రూపాయలు సహాయం చేసి వార్తల్లో నిలిచారు. ఇక యష్ తో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X