Toxic: టాక్సిక్ మూవీపై షాకింగ్ రూమర్లు.. అసలు వాస్తవం ఏమిటంటే?
కేజీఎఫ్ సినిమా తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ నటించే సినిమా ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన సినిమా కోసం కేవలం కన్నడ సినిమా అభిమానులే కాకుండా దక్షిణాది, హిందీ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఆయన భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇటీవల కాలంలో అనేక రూమర్లు వస్తున్నాయి. అయితే ఆ గాసిప్ వార్తలను కొట్టివేస్తూ చిత్ర నిర్మాత, యూనిట్ సభ్యులు అధికారికంగా వివరణ ఇచ్చారు. ఈ సినిమాపై వచ్చిన రూమర్లు ఏమిటి? వారు ఇచ్చిన వివరణ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్ సినిమా విషయానికి వస్తే.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి లాంటి టాప్ హీరోయిన్లు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్, టొవినో థామస్, అమిత్ తివారీ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 19, 2026లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

అయితే ఈ సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఎప్పుడూ ప్రారంభమవుతుందో తెలియదు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగిపోయింది. హీరో యష్‌కు గట్టి షాకే అంటూ సోషల్ మీడియాలోను, జాతీయ మీడియాలోను వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలను నమ్మకండి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. రిలీజ్ వాయిదా వేసినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని వారు వివరించారు.
టాక్సిక్ సినిమా షెడ్యూల్ ముంబైలో త్వరలోనే ప్రారంభం అవుతుంది. హీరో యష్ మా సినిమాతోపాటు రామాయణం సినిమా షూటింగులో కూడా ఏకకాలంలో పాల్గొంటారు. బెంగళూరులో కూడా ఫైనల్ షెడ్యూల్ షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 2026 నుంచి పూర్తిస్థాయి ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తాం అని కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటనలో తెలిపింది.
2026 సంవత్సరంలో రానున్న ప్రధాన పండుగలు గుడి పడ్వా, ఉగాది సెలవులను టార్గెట్ చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఆ తర్వాత ఈద్ బరిలో కూడా ఈ సినిమా ఉంటుంది అని నిర్మాత వెంకట్ కే నారాయణ, మానస్టర్ మైండ్ బ్యానర్లు తెలిపాయి.


Click it and Unblock the Notifications











