‘OG మూవీపై పొలిటికల్ దెబ్బ.. పవన్ సినిమాను ప్రదర్శించం.. డబ్బు వాపస్ చేస్తాం‘

ఓవర్సీస్ మార్కెట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ (OG) మూవీకి భారీ దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో కీలక భాగమైన కెనడాలో అధిక ప్రాంతాల్లో ఈ మూవీ షోలను క్యాన్సిల్ చేసినట్టు.. ఆ దేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అందుకు కారణం నార్త్ అమెరికాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వ్యక్తులు చేస్తున్న అరాచకాలు, అనైతిక చర్యల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకు చింతిస్తున్నాం. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక, రాజకీయ విభేదాలు సృష్టించి.. ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించాం. దాంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని తమ లేఖలో పేర్కొన్నారు. యార్క్ సినిమాస్ విడుదల చేసిన లేఖ సారాంశం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

They Call him OG అనే సినిమా ప్రదర్శనలన్నీ యార్క్ సినిమాస్ క్యాన్సిల్ చేశామని చెప్పడానికి కష్టమైన నిర్ణయం అయినప్పటికీ.. తెలియజేయకతప్పడం లేదు. ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో కల్చరల్, పొలిటికల్ వర్గాలకు సంబంధం ఉంది. కాబట్టి.. ప్రజల సురక్షితం, సెక్యూరిటీ విషయంలో మాకు ఆందోళన ఉంది. కాబట్టి ఈ షోలను క్యాన్సిల్ చేశాం. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని తెలియజేస్తున్నాం. ప్రేక్షకులు ఎవరైతే టికెట్ ముందుస్తుగా బుక్ చేసుకొన్నారో.. వారికి డబ్బును పూర్తిగా వాపస్ చేస్తాం. ప్రేక్షకులు, మా ఉద్యోగులు, పబ్లిక్ సెక్యూరిటీ మా టాప్ ప్రయారిటీ అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నాం అని యార్క్ సినిమాస్ ట్విట్ చేసింది.

Pawan Kalyan s OG Cinema screening in Canada

నార్త్ అమెరికాలో ఓజీ సినిమాను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ తరఫు వ్యక్తులు యార్క్ సినిమాస్ నుంచి కొన్ని రిక్వెస్టులు వచ్చాయి. ఈ సినిమా సేల్స్ గణాంకాలను పెంచమని ఫోర్స్ చేశారు. తద్వారా భవిష్యత్‌లో రిలీజ్ అయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్లాన్ వేశారు. గత కొద్దికాలంగా నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై కంట్రోల్ పెంచుకోవడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. సామాజిక, రాజకీయ వర్గాలతో సంబంధాలు పెంచుకొని ఇలాంటి వ్యక్తులు నార్త్ అమెరికాలో కల్చరల్‌గా విభేదాలు సృష్టించి విడగొట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి అనైతిక చర్యలు, విధానాలను యార్క్ సినిమాస్ వ్యతిరేకిస్తూ వస్తున్నది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామరస్యతను పెంచేందుకు.. వారిని ప్రోత్సహించేందుకు యార్క్ సినిమాస్ ప్రయత్నిస్తున్నది అని తమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సౌత్ ఏషియన్ ఫిల్మ్స్‌తో మా సంబంధాలు, మా సంస్థ ఆర్థికపరమైన విషయాల గురించి అవాస్తవ కథనాలను ఆన్‌లైన్ మీడియాలో ఓజీ డిస్టిబ్యూటర్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారాలు వాస్తవానికి దూరం.వాటిలో నిజం లేదని యార్క్ సినిమాస్ ఖండిస్తున్నది. ఇలాంట తప్పుడు ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం అని యార్క్ సినిమా మేనేజ్‌మెంట్ అధికారికంగా ట్విట్టర్‌లో లేఖను విడుదల చేసింది.

More from Filmibeat

Read more about: pawan kalyan og north america
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X