సమంత, చిరంజీవికి అవార్డు.. వేడుకల్లో ఇస్మార్ట్ జోరు

జీ సినీ అవార్డు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇటీవలె చెన్నైలో తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వేడుక జరగ్గా.. తాజాగా టాలీవుడ్‌లో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ వేడుకలో తారలు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సమంత, రామ్, పూరి జగన్నాథ్ లాంటి వారికి అవార్డులు వరించాయి. ఓ సారి ఆ వివరాలను చూద్దాం.

సైరా, మజిలీలో నటనకు..

సైరా, మజిలీలో నటనకు..

రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరా చిత్రం తెలుగు నాట సంచలన్నా నమోదు చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి అద్భుత నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తాజాగా జీ సినీ వేడుకల్లో ఉత్తమ నటుడి అవార్డు కూడా లభించింది. అలాగే మజిలీ చిత్రంలో శ్రావణి పాత్రను పోషించిన సమంతను ఉత్తమ నటి అవార్డు వరించింది.

ఇస్మార్ట్ బృందం జోరు..

ఇస్మార్ట్ బృందం జోరు..

చాలా కాలం తరువాత డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టాడు. ఈ మధ్య కాలంలో అంతటి మాస్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడం కేవలం ఇస్మార్ట్‌కు దక్కిన ఘనతే. ఈ సినిమాకు గానూ బెస్ట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్, నిర్మాతగా చార్మీ, సంగీత దర్శకుడిగా మణిశర్మ, బెస్ట్ సెన్సేషనల్ హీరోగా రామ్ అవార్డులు అందుకున్నారు.

ఆనంద్ దేవరకొండ, శివాత్మికలకు..

ఆనంద్ దేవరకొండ, శివాత్మికలకు..

ఎన్నో అంచనాలతో వచ్చిన ఆనంద్ దేవరకొండ, శివాత్మికలకు బెస్ట్ డెబ్యూ హీరో, హీరోయిన్లుగా ఎంపికయ్యారు. జెర్సీ చిత్రానికి గానూ నానికి ఫేవరేట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు. బ్రోచేవారెవరురా చిత్రానికి గానూ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలకు ఉత్తమ హాస్యనటులుగా ప్రకటించారు.

అల్లరి నరేష్‌, కె. విశ్వనాథ్‌లకు..

అల్లరి నరేష్‌, కె. విశ్వనాథ్‌లకు..

మహర్షి చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయ నటుడుగా అల్లరి నరేష్‌కు అవార్డును అందజేశారు. జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డును కళాతపస్వీ కె విశ్వనాథ్‌కు అందజేశారు. రత్నవేలుకు ఉత్తమ సినిమాటోగ్రఫర్, డియర్ కామ్రేడ్ ఆల్బమ్ ఫేవరేట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్‌గా, జార్జ్ రెడ్డి చిత్రంలోని నటనకు గానూ తిరువికి ఉత్తమ విలన్ అవార్డును ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X