Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Romantic Day 2 Collections: తగ్గిపోయిన రొమాంటిక్ హవా.. ఇంకా ఎంత రావాలంటే?
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదట ఆంధ్ర పోరి అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఆకాష్ ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబా అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. ఎలాగైనా మళ్లీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకోవాలని రొమాంటిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

భారీగా ప్రమోషన్స్
పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ సినిమాకు అనిల్ పడూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ కు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు కోసం ఇండస్ట్రీలోని టాప్ దర్శకులకు ప్రత్యేకంగా షోలను వేశారు. దాదాపు అందరి నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక ప్రభాస్ కూడా తనవంతు సపోర్ట్ గా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి సినిమా ట్రైలన్ ను లాంచ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశాడు.

రెండవరోజు కలెక్షన్స్
ఇక ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ అయితే చాలా తగ్గిపోయాయి. శుక్రవారం రోజు ఆంధ్రా, నైజాంలో 1.52 షేర్ అందుకున్న ఈ మూవీ శనివారం వారం ఒక్కసారిగా డౌన్ అయ్యింది. రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 28 లక్షలు, సీడెడ్‌లో 19 లక్షలు, ఉత్తరాంధ్రతో 9 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షలు, గుంటూరులో 6 లక్షలు, కృష్ణా జిల్లాలో 5 లక్షలు, నెల్లూరులో 4 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో 0.83 కోట్ల షేర్ రాగా, 1.25 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్
ఇక కర్ణాటకలో అలాగే మిగతా రాష్ట్రాల్లో సినిమా రెండు రోజుల్లో కేవలం 6 లక్షల రూపాయలను రాబట్టింది. ఒక విదంగా పునీత్ రాజ్ కుమార్ మరణం ఈ సినిమాపై ప్రభావం గట్టిగానే చూపించినట్లు అర్ధమవుతోంది. ఇక ఓవర్సీస్‌లో రొమాంటిక్ డోస్ ఎక్కువగా వర్కౌట్ కాలేదు. ఓవర్సీస్ లో 7లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 2.48 కోట్ల షేర్ రాబట్టిన రొమాంటిక్ మూవీ రూ.2.42 కోట్లు గ్రాస్ వసూళ్లను అందుకుంది.
Recommended Video

ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే..
అయితే రొమాంటిక్ సినిమా శుక్రవారం, శనివారం వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే ఆదివారం చాలా కీలకం కానుంది. సండే వీలైనంత ఎక్కువగా వసూళ్లను అందుకుంటేనే సినిమా ఈజీగా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ మూవీ రూ.4.60 కోట్ల బిజినెస్ చేసింది. ఇక సినిమా ప్రాఫిట్ లోకి రావాలి అంటే మొత్తంగా 5 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంటే ఇంకా 2.52కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి సినిమా ఎంతవరకు వసూళ్లను అందుకుంటుందో చూడాలి.