twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్య కూడా ఏడవాలా? 150 కలెక్షన్స్, రెమ్యూనరేషన్‌పై ... నాగబాబు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 150వ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా ఇదే. అయితే ఈ సినిమా ఓవరాల్‌గా ఎంత వసూలు చేసిందనే విషయంలో సరైన క్లారిటీ లేదు.

    మరో వైపు... ఇంత భారీ వసూళ్లు సాధించిన సినిమాకు చిరంజీవికి రెమ్యూనరేషన్ కింద ఎంత ముట్టింది? అసలు తండ్రీ కొడుకుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయా? అనేది కూడా ఇండస్ట్రీలో కొంతకాలంగా హాట్ టాపిక్ నడుస్తోంది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు ఇందుకు సంబంధించిన విషయాలపై స్పందించారు.

    రెమ్యూనరేషన్

    రెమ్యూనరేషన్

    అన్నయ్య కు రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారో తెలియదు. ఆ విషయం అడగటానికి నేను ఇబ్బంది పడతాను. తండ్రి కొడుకుల వ్యవహారం...వారిద్దరి మధ్యలో ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు అనేది ఎలా చెబుతాం. అన్నయ్య వేరే నిర్మాతతో చేస్తే తప్ప అన్నయ్యగారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో బయటికి తెలియదు అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    అన్నయ్య కూడా ప్రపంచ మంతా ఇంతే అంటూ ఏడవాలా?

    అన్నయ్య కూడా ప్రపంచ మంతా ఇంతే అంటూ ఏడవాలా?

    బాలకృష్ణ తన 100వ సినిమాకు మంచి హిస్టారికల్ సబ్జెక్టు తీసుకున్నారు, చిరంజీవి కేవలం కమర్షియల్ సినిమా చేసారు అనే విమర్శలు వచ్చాయనే ప్రశ్నపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. 150 మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని నేను అనడం లేదు, దాంతో పాటు రైతుల గురించి కూడా ఉంది. రైతుల ప్రాబ్లం ఈ మధ్య కాలంలో ఎవరైనా డీల్ చేసారా? కమర్షియల్ పెట్టకూడదా? చిరంజీవి గారు కూడా అలా విచారంగా.... ప్రపంచమంతా ఇంతే అంటూ ఏడవాలా? ఆయన సినిమాలో అన్నీ ఏడుపు పాటలే ఉండాలా? అలా చేస్తేనే అది మంచి చిత్రం అవుతుందా? అంటూ నాగబాబు ఎదురు ప్రశ్నించారు.

    150వ మూవీ వసూళ్లపై

    150వ మూవీ వసూళ్లపై

    నాకు ఉన్న సోర్స్ ప్రకారం.... ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ దాటింది. ఫుల్ రన్ లో రూ. 175 కోట్ల నుండి 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది. ఫుల్ రన్ లో మినిమమ్ షేర్ 120 నుండి 150 షేర్ వస్తుంది అని నాగబాబు అన్నారు. చాలా ఏరియాల్లో 150 చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిందని నాగబాబు తెలిపారు.

    ఆ విషయాలు బయటకు రాలేదు

    ఆ విషయాలు బయటకు రాలేదు

    చాలా చోట్ల ఒక థియేటర్ షో వసూళ్లు అఫీషియల్ గా రూ. వెయ్యి వస్తుందనుకుంటే 10 వేల వరకు అమ్మాయి. నైజాంలో చాలా థియేటర్స్ హైర్స్ విషయం బయటకు రాలేదు. ఇవన్నీ కలిపుకుంటే 150వ మూవీ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉంటాయని నాగబాబు చెప్పుకొచ్చారు.

    క్రెడిట్ చరణ్‌కే

    క్రెడిట్ చరణ్‌కే

    అన్నయ్య 150వ సినిమా విజయంలో సంబంధించి పూర్తి క్రెడిట్ చరణ్ కే ఇస్తాను. నిర్మాతగా కాస్ట్ అండ్ క్రూ సరైన ఎంపిక చేసాడు కాబట్టే ఇది సాధ్యమైంది. సినిమాకు ఇంత స్పందన రావడానికి అన్నయ్య రీ ఎంట్రీ విషయం 50 శాతం కారణం అయితే, వినాయక్, రత్నవేలు, మిగతా ఎలిమెంట్స్ అన్నీ కలిపి 50 శాతం దోహదం చేసాయని నాగబాబు తెలిపారు. వినాయక్ ను డైరెక్టర్ గా ఎంపిక చేయడం చాలా కరెక్ట్. సీనియర్ హీరోలను డీల్ చేయడంలో వినయ్ సూపర్ అని నాగబాబు తెలిపారు.

    అన్నయ్య వైట్ ఎలిఫెంట్, వినాయక్ ధైర్యానికి మెచ్చుకోవాలి

    అన్నయ్య వైట్ ఎలిఫెంట్, వినాయక్ ధైర్యానికి మెచ్చుకోవాలి

    అన్నయ్య వైట్ ఎలిఫెంట్ లాంటోడు. ఆయన్ను తప్పుగా హ్యాండిల్ చేస్తే తిట్లు తినేది డైరెక్టరే. ఏదైనా తేడా జరిగితే బ్లేమ్ భరించడానికి ధైర్యం ఉండాలి. ఈ విషయంలో ధైర్యం తీసుకున్న వినాయక్ ను మెచ్చుకోవాలి అని నాగబాబు అన్నారు.

    మా మధ్య విబేధాలు లేవు

    మా మధ్య విబేధాలు లేవు

    పవన్ కళ్యాణ్ ఏదైనా వేడుకకు హాజరు కానంత మాత్రాన మా మధ్య విబేధాలు ఉన్నట్లు కాదు. వాడికి సవాలక్ష పనులుంటాయి. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు... అని నాగబాబు తెలిపారు.

     పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు

    పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు

    పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Mega brother Naga Babu about Khaidi No 150 collections and Chiranjeevi remunaration. Naga Babu said that Khaidi No 150 movie crossed Rs.150 cr gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X