twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger day 1 collection prediction విజయ్ దేవరకొండ మానియా.. హాట్ కేకుల్లా టికెట్ల అమ్మకాలు

    |

    అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించకొన్న విజయ్ దేవరకొండ తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి అనన్య పాండేకు ఇది బహుభాషా చిత్రంగా రూపొందుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల అంచనా, తొలి రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే...

    హిందీలో ఒకరోజు ఆలస్యంగా రిలీజ్

    హిందీలో ఒకరోజు ఆలస్యంగా రిలీజ్


    లైగర్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా హిందీలో తప్ప మిగితా భాషల్లో ఆగస్టు 25 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. హిందీ వెర్షన్ గురువారం (ఆగస్గు 25న) ఈవెనింగ్ షోతో ప్రారంభమై.. శుక్రవారం అధికారికంగా ఉత్తరాదిలో విడుదల అవుతున్నది.

    100 కోట్ల బడ్జెట్‌తో

    100 కోట్ల బడ్జెట్‌తో


    ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించిన లైగర్ చిత్రం సుమారు 100 కోట్ల బడ్డెట్‌తో రూపొందింది. ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. ఫస్టాఫ్ 1 గంట 15 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 5 నిమిషాలు ఉంటుంది. ఈ చిత్రంలో ఏడు ఫైట్స్, ఆరు పాటలు ఉంటాయి అని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ రచ్చ

    హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ రచ్చ


    హైదరాబాద్‌లో లైగర్ చిత్రం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో 523 షోలు ప్రదర్శిస్తుండగా.. ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే.. 56 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రం ఇప్పటికే 2.6 కోట్ల వసూళ్లు సాధించింది. రిలీజ్ డేట్ నాటికి ఈ చిత్రం హైదరాబాద్‌లో 5 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఆల్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్ ఇలా

    ఆల్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్ ఇలా


    ఇక ఆల్ ఇండియా బుకింగ్ విసయానికి వస్తే.. లైగర్ హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా 4000 షోలను ప్రదర్శిస్తున్నారు. హిందీలో అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఈ సినిమా 6.3 శాతం అక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. సుమారు 1.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా విడుదలకు మూడు రోజులు ఉంది కాబట్టి రానున్న రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఆస్ట్రేలియాలో భారీగా ఒపెనింగ్స్

    ఆస్ట్రేలియాలో భారీగా ఒపెనింగ్స్


    ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్సు బుకింగ్ భారీగా నమోదైంది. మొత్తం 51 లొకేషన్లలో 152 షోలు ప్రదర్శిస్తున్నారు. మొత్తం 950 టికెట్లు అమ్ముడుపోయాయని తాజా సమాచారం. రానున్న రోజుల్లో ఈ సినిమాకు మరింత ఆదరణ పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    యూఎస్ఏలో కూడా అదే జోష్

    యూఎస్ఏలో కూడా అదే జోష్


    అమెరికాలో లైగర్ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించి 8 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. 162 లోకేషన్లలో ఇప్పటి వరకు 125K అమెరికన్ డాలర్లు అమ్ముడయ్యాయి. ఇంకా ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది.

    తొలి వారం కలెక్షన్ల అంచనా ఎంతంటే?

    తొలి వారం కలెక్షన్ల అంచనా ఎంతంటే?


    లైగర్ సినిమాపై ఇప్పటి వరకు సానుకూలత వ్యక్తమవుతున్నది. ఈ సినిమా టాక్ యావరేజ్ టాక్ ఉన్నా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి వారం ముగిసే సమయానికి 250 నుంచి 350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజుల్లో విజయ్ దేవరకొండ ప్రభంజనం ఎలా కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Vijay Deverakonda's Liger's advance sales started high note. Here is the day 1 prediction of Worldwide collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X