X
హోమ్ » సెలెబ్స్ » నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల

Actress
బయోగ్రఫీ:  నీహారిక కొణిదెల తెలుగు సినిమా నటి. ప్రముఖ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు. నీహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అటు తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది. జూన్ 2016లో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసినది. ఆమె తెలుగు సినిమాకు తెరంగేట్రం చేసే ముందు టెలివిజన్ లో వ్యాఖ్యాతగా పనిచేసారు. ఆమె తెలుగూ టెలివిజన్ ఛానల్ "ఈటీవీ"లో నిర్వహింపబడు తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలు అయిన ఢీ జూనియర్స్-1, ఢీ జూనియర్స్-2 లకు ఆంకర్ గా పనిచేసింది. ఆమె తెలుగు భాషలో వెలువడిన లఘు చిత్రం "ముద్దపప్పు ఆవకాయ్"లో నటించారు, నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2015 సెప్టెంబరు చివరిలో ఆమె ఒక మనసు చిత్రంలో నటించుటకు సంతకం చేసారు. ముద్దపప్పు ఆవకాయ్ లఘు చిత్రంలో ఈ నగరంలో పెరిగిన ఈ తరం అమ్మాయిలా జీన్స్ ప్యాంటులు వేసుకొని చేసిన పాత్రలో నీహారిక ఒదిగిపోయింది. ఒక మనసు లో పక్కింటి అమ్మాయి వలె చుడీదార్లు/చీరలు కట్టి మెప్పించి అన్ని రకాల పాత్రలు చేయగలదని నిరూపించుకొన్నది.   వివాహం  గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు అయిన చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో వీరి వివాహం 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.    విడాకులు   పెళ్లయిన రెండేళ్లకు చైతన్య, నిహారిక మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి నిహారిక, చైతన్యలకు పెళ్లయిన ఏడాదిన్నరకే విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. అయితే, గతేడాది మార్చిలో నిహారికను ఉద్దేశించి చైతన్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. బాగానే ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ, గత రెండుమూడు నెలలుగా విడాకుల వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ రూమర్లకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి  నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఎట్టేకేలకు విడాకులు తీసుకున్నారు. 
మరింత చదవండి

నిహారిక కొణిదెల సినిమాలు

నిహారిక కొణిదెల:

నిహారిక కొణిదెల

పేరు నిహారిక కొణిదెల
పుట్టిన రోజు 18 Dec 1993
వయసు 33
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

నిహారిక కొణిదెల ఆస్తి

ఆస్తి

నిహారిక కొణిదెల ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+