X
ఎఫ్ 3

ఎఫ్ 3

Comedy | 27 May 2022 | U | 148 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఎఫ్ 3 స్టోరీ

ఎఫ్ 3 సినిమా కామెడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ సునీల్, అలీ, ప్రగత్య, అన్నపూర్ణ, వై విజయ, మురళి శర్మ, రఘు బాబు, వెన్నెల కిషోర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావి పూడి వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.  కథ డబ్బే సర్వస్వంగా బతికే పారిశ్రామికవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ). కష్టపడకుండా ఏదో మాయ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కనే వెంకీ (వెంకటేశ్), వరుణ్ (వరుణ్ తేజ్). మంగ టిఫిన్ సెంటర్‌ నడిపిస్తూ.. కూతుళ్ల అందచందాలతో అప్పనంగా డబ్బు సంపాదించే ప్లాన్స్‌లో కుటుంబం (తమన్నా, మెహ్రీన్, వై విజయ, అన్నపూర్ణ, ప్రదీప్). అయితే డబ్బు కొట్టేయడం కోసం ఈ బ్యాచ్ అంతా ఆనంద్ ప్రసాద్ ఇంట్లో తిష్ట వేస్తారు. డబ్బు కోసం అత్యాశ పడే వెంకీ, వరుణ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మంగ టిఫిన్ సెంటర్ టీమ్ ఎలాంటి మోసాలకు పాల్పడ్డారు. వెంకీ, వరుణ్‌ను మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్‌ ఎలా ఆడుకొన్నారు? డబ్బే ప్రపంచంగా బతికే ఆనంద్ ప్రసాద్‌కు ఎదురైన సమస్య ఏమిటి? ఆనంద్ ప్రసాద్‌ డబ్బును ఎందుకు వెంకి, వరుణ్ కొట్టేయాలని అనుకొంటారు? ఆనంద్ ప్రసాద్‌కు ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు వెంకీ, వరుణ్, మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్ ఎలా ప్లాన్ చేశారు. ఆనంద్ ప్రసాద్ సమస్య తీరిందా? రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలుకొన్న వెంకీ, వరుణ్ ఎలాంటి గుణపాఠం నేర్చుకొన్నారు. ఇలాంటి వ్యక్తులను డబ్బు ఎలాంటి ఆటలు ఆడించిందనే ప్రశ్నలకు సమాధానమే F3 సినిమా.
Read More

ఎఫ్ 3 కాస్ట్ & క్రూ

ఎఫ్ 3 సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనిల్ రావిపూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు తమ్మిరాజు
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎఫ్ 3 విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు లేకుండా F2 సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి చేసిన నాసిరకమైన ప్రయత్నం F3 మూవీ. కథాపరంగా విలువలు లేకుండా.. ఫన్ పేరుతో చేసిన అతుకుల బొంత అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. వెంకటేష్, వరుణ్ తేజ్ డిఫరెంట్ ఫెర్ఫార్మెన్స్ కోసం వీలుంటే ఓ సారి చూడవచ్చు. ఎలాంటి లాజిక్స్ ఆశించకుండా, అంచనాల లేకుండా సినిమాకు వెళితే యావరేజ్ ఫన్ లభిస్తుంది. టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని ఎందుకులే అనుకొంటే.. ఓటీటీ వరకు వేచి ఉండటం బెటర్. F3 మూవీ కమర్షియల్‌గా, వాస్తవంగా ఎంత వసూలు చేస్తుందో అనే విషయం.. కొద్ది రోజులు ఆగితే బాక్సాఫీస్ వద్ద తేలిపోతుంది.

ఎఫ్ 3 ట్రైలర్

Video Thumbnail

ఎఫ్ 3 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎఫ్ 3

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+