»   » మళ్లీ బాలయ్యతో ఎన్టీఆర్ అమీతుమీ.. ఈసారి గెలుపెవ్వరిది?

మళ్లీ బాలయ్యతో ఎన్టీఆర్ అమీతుమీ.. ఈసారి గెలుపెవ్వరిది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నువ్వా నేనా అనే రీతిలో నందమూరి హీరోలు కాలు దువ్వుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. ఓ పక్క రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతుండగా.. మరో పక్క క్రేజీ కాంబినేషన్‌లో నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్ రెడీ అవుతున్నారు. వీరిద్దరి చిత్రాలు సెప్టెంబర్‌లోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో నందమూరి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు.

గతేడాది మాదిరిగానే..

గతేడాది మాదిరిగానే..

గతేడాది సంక్రాంతి రేసులో బాబాయి, అబ్బాయి ముఖాముఖి తలపడ్డారు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంతో, బాలయ్య డిటెక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీరిద్దరి చిత్రాలు ఒకే సమయంలో విడుదల కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బాలయ్య, ఎన్టీఆర్ సేఫ్

బాలయ్య, ఎన్టీఆర్ సేఫ్

నాన్నకు ప్రేమతో భారీ విజయాన్ని సాధించగా, డిటెక్టర్ కలెక్షన్ల పరంగా మంచి లాభాలను సాధించింది. సంక్రాంతి సీజన్ కావడంతో ఎలాంటి నష్టం జరుగకుండా నందమూరి హీరోలు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ సారి పోటీ తప్పదా?

ఈ సారి పోటీ తప్పదా?

ఈ ఏడాది కూడా వారిద్దరి మధ్య పోటీ తప్పేలా లేదు. షూటింగ్ ప్రారంభ సమయంలోనే బాలయ్య సినిమాను సెప్టెంబర్‌లోనే విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకొన్నారు. ఆ క్రమంలోనే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ నిర్ణీత తేదీలోనే రిలీజ్‌కు పరుగులు పెడుతున్నది.

 సెప్టెంబర్ రెడీ అవుతున్న అబ్బాయి

సెప్టెంబర్ రెడీ అవుతున్న అబ్బాయి

ఇక బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ చిత్రం ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల రిలీజ్ డేట్ సెప్టెంబర్ వరకు వెళ్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే బాబాయ్, అబ్బాయిలు అమీ తుమీ తేల్చుకొనే ప్రమాదం ఉంది.

రాజకీయంగా దూరం..

రాజకీయంగా దూరం..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీ వ్యవహారాలకు తండ్రి హరికృష్ణ కూడా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా వీరి సంబంధాలు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య, ఎన్టీఆర్ సినిమా ఒకే సమయంలో విడుదలైతే నందమూరి ఫ్యాన్స్‌కు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.

English summary
Tollywood is reportedly getting ready to witness yet another clash between balakrishna and Junior NTR. Jr NTR's 'Jai Lava Kusa' is Most-likely to see the light on 11th August. Reports in the news that the same date Balakrishna movie set for the release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu