Just In
- 47 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
Corona Vaccine: మీ వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం ఉందా ?, అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు, ఇదే !
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవిని వదిలే సమస్యే లేదు.. పూరి జగన్నాథ్ పక్కా ప్లాన్!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయనతో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు బడా దర్శకులు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తుండగానే.. తదుపరి సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు కొందరు దర్శకులు. ఈ నేపథ్యంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రంగంలోకి దిగేందుకు పక్కా ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

నెక్ట్స్ సినిమాల కోసం పూరి ప్రయత్నం.. లైన్ లోకి చిరు
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో గ్రాండ్ సక్సెస్ ఖాతాలో వేసుకొని మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేశాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా చేస్తున్న ఈ డైరెక్టర్ నెక్ట్స్ సినిమాల కోసం కూడా కథలను రెడీ చేస్తున్నారట. ఈ మేరకు చిరంజీవిని లైన్ లోకి తీసుకురావాలని ఆయన స్కెచ్ వేస్తున్నారట.

గతంలోనే అవకాశం.. కానీ
గతంలోనే చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకుని, ఆ తర్వాత చేజార్చుకున్నాడు పూరిజగన్నాథ్. అయితే ఆ విషయం గురించి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన ఆయన.. నాలుగుసార్లు తనకు చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి ఆగిపోయిందని చెప్పాడు. రెండుసార్లు పూజా కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత చిరంజీవి సినిమా ఆగిపోయిందని అన్నాడు.

ఆటో జానీ.. అనుకోకుండా అలా
నిజానికి చిరంజీవితో పూరి జగన్నాథ్ ఎప్పుడో 'ఆటో జానీ' సినిమా చేయాల్సి ఉంది. కథ రాసుకుని అప్పట్లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చాడు నిర్మాత రామ్ చరణ్. అయితే చిరుకి సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కనబెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సినిమా అలా ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ చిరు కోసం పూరి ప్రయత్నాలు స్టార్ట్ చేశారట.

చిరంజీవిని వదిలే సమస్యే లేదు
అయితే ఈ సారి మాత్రం చిరంజీవిని వదిలే సమస్యే లేదంటున్నాడు పూరి జగన్నాథ్. పక్కాగా ఆయనకు నచ్చే కథ సిద్ధం చేస్తానని, బలమైన కథాంశంతో ఆయన ముందుకెళతానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. చిరంజీవి సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగలా ఉండాలని, అలాంటి కథతోనే ఆయనను మెప్పిస్తానని అంటున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్.

పూరికి ఇదే బెస్ట్ ఛాన్స్..
ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇక మెగా 153 ఈ కాంబోలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు చిరంజీవి- కొరటాల శివ మూవీ ఫినిష్ అయ్యేలోగా ఇటు పూరిజగన్నాథ్- విజయ్ దేవరకొండ ఫైటర్ కూడా పూర్తవుతుంది. సో.. చిరుని మెప్పించాలే గానీ పూరికి ఇదే బెస్ట్ ఛాన్స్. ఏంమంటారు?.