For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పూరీ సినిమా: మెగాస్టార్ స్థానంలో ఆ హీరో.. ప్లాన్ మామూలుగా లేదుగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకడు. హీరోలకు ప్రత్యేకమైన మేనరిజం పెట్టి.. గొప్పగా ఎలివేట్ చేసి చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనేలా సత్తా చాటుతున్నాడు. అందుకే ఆ దర్శకుడితో సినిమాలు చేయడానికి హీరోలంతా క్యూ కడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం చిరంజీవి కూడా రీఎంట్రీ మూవీ కోసం అతడితో చర్చలు జరపగా.. అవి విఫలం అయ్యాయి. అప్పుడు మెగాస్టార్‌కు చెప్పిన కథతోనే ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడట. అది కూడా మరో హీరోతో కావడం విశేషం. ఆ వివరాలు మీకోసం!

  చిరంజీవికి ఆ సినిమా కథ చెప్పిన పూరీ

  చిరంజీవికి ఆ సినిమా కథ చెప్పిన పూరీ

  మూడేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఇందుకోసం పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయాలని అనుకున్నారు. అప్పుడు ఈ డైరెక్టర్ ఆయనకు ‘ఆటో జానీ' అనే స్టోరీని వినిపించాడు. ఈ స్క్రిప్టులో ఫస్టాఫ్ అదిరిపోయినా.. సెకెండాఫ్‌కు మాత్రం మార్పులు సూచించారు మెగాస్టార్. అవి చేసినా ఎందుకో సంతృప్తి చెందని ఆయన దీన్ని హోల్టులోనే ఉంచారు.

  ఆ తర్వాత కూడా ప్రయత్నాలు జరిపాడు

  ఆ తర్వాత కూడా ప్రయత్నాలు జరిపాడు

  పూరీ జగన్నాథ్‌తో చిరంజీవి సినిమా చేయడం కుదరలేదు. దీంతో ఆయన వీవీ వినాయక్‌తో ‘ఖైదీ నెంబర్ 150' అనే మూవీ చేశారు. ఆ తర్వాత సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ‘సైరా: నరసింహారెడ్డి'లో నటించారు. ఆ సమయంలోనూ పూరీ జగన్నాథ్.. చిరంజీవితో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిపాడు. ఇందుకోసం ‘ఆటో జానీ' కథలోనే పలు రకాలుగా రాసుకుని వెళ్లాడని అన్నారు.

  ‘ఇస్మార్ట్' హిట్... ‘లైగర్‌'తో బాలీవుడ్‌లోకి

  ‘ఇస్మార్ట్' హిట్... ‘లైగర్‌'తో బాలీవుడ్‌లోకి

  చిరంజీవితో సినిమా చేయాలన్న పూరీ జగన్నాథ్‌కు కాలం కలిసి రాలేదు. దీంతో ఆయన రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్' తెరకెక్కించాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లోకి వెళ్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది.

  చిరు ఫుల్ బిజీ.. పూరీ నిర్ణయం మార్పు

  చిరు ఫుల్ బిజీ.. పూరీ నిర్ణయం మార్పు


  ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివతో ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్', మెహర్ రమేశ్‌తో ‘వేదాళం' రీమేక్‌లు చేయబోతున్నారు. వీటితో పాటు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో ఓ స్టైయిట్ మూవీ కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో పూరీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  మరో హీరోతో ‘ఆటో జానీ' సినిమాకు రెడీ

  మరో హీరోతో ‘ఆటో జానీ' సినిమాకు రెడీ


  ‘లైగర్' తర్వాత పూరీ జగన్నాథ్ చేయబోయే మూవీ గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. తన తదుపరి సినిమాను ‘ఆటో జానీ' కథతోనే రూపొందించబోతున్నాడట పూరీ జగన్నాథ్. ఇందుకోసం చిరంజీవిని కాకుండా వేరే హీరోను తీసుకోబోతున్నాడని తెలిసింది.

  Sekhar Kammula Reacts On Alanti Sitralu Trailer
  అతడికి కథ వినిపించిన పూరీ జగన్నాథ్

  అతడికి కథ వినిపించిన పూరీ జగన్నాథ్

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పూరీ జగన్నాథ్ ‘ఆటో జానీ' కథను ఇటీవలే మాస్ మహారాజా రవితేజకు వినిపించాడట. దీనికి అతడు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. అయితే, తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు మార్పులు చేయమని సూచించాడట. ఇప్పుడు పూరీ అదే పనిలో ఉన్నాడని టాక్. గతంలో వీళ్లిద్దరి కలయికలో ఐదు సినిమాలు వచ్చాయి.

  English summary
  When Chiru was looking to make a solid comeback before Khaidi No.150, Puri narrated a storyline and titled it as 'Auto Jaani'. But, it did not move forward and Puri had missed an opportunity to work with Megastar for his comeback movie. However, undeterred Puri didn't stop his efforts to make a film with Chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X