లైగర్ రిజల్ట్ పై రివ్యూ ఇచ్చిన హీరోయిన్ తండ్రి.. విజయ్ అలాంటి హీరో అంటూ..

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న లైగర్ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను చాలా స్పెషల్ గా తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతొంది. సాధారణంగా పూరి ఏదైనా సినిమాను సెట్స్ పైకి తెస్తే చాలా తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటాడు. ఇక లైగర్ విషయంలో మాత్రం అలా కాకుండా కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు.

లైగర్ సినిమా ఎప్పుడో ఫినిష్ అవ్వాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ వలన రెండు సార్లు బ్రేకులు పడ్డాయి. ఇక మొత్తానికి ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఆ సినిమా పై కొంతమంది సెలబ్రెటీలు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదివరకే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇటీవల హీరోయిన్ అనన్య పాండే తండ్రి ఛంకి పాండే కూడా స్పందించారు. సినిమా సూపర్ హిట్ అనే రేంజ్ లో రివ్యూ కూడా ఇచ్చారు.

Ananya pandey about vijay devarakonda liger movie

ఛంకి పాండే మాట్లాడుతూ.. వ్వా.. పిక్చర్ హిట్. నేను నమ్మకంగా చెప్పగలను. విజయ్ దేవరకొండ ఆల్ రౌండర్, అతను యాక్షన్ తో పాటు డ్యాన్స్, అలాగే అన్ని కూడా అదే ఎనర్జీతో చేయగలడు. తప్పకుండా ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలుస్తుంది.. అని అన్నారు.. దీంతో సినిమాపై మరోసారి అంచనాలు పెరిగిపోయాయి. ఇక సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మితో పాటు కరణ్ జోహార్ కూడా సహా నిర్మాతగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

సినిమాతో ఎలాగైనా నేషనల్ లెవెల్లో మార్కెట్ సెట్ చేసుకోవాలని విజయ్ గట్టిగానే కష్టపడుతున్నాడు. ఫస్ట్ హాఫ్ లో నేషనల్ లెవెల్ బాక్సర్ గా కనిపించనున్న రౌడి స్టార్ సెకండ్ హాఫ్ అనంతరం ఇంటర్నేషనల్ లెవెల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. మరి సినిమా విడుదల అనంతరం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X