twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger తో గట్టిగా కొడుతున్నాం.. ప్రతీ సీన్ దిమ్మతిరిగేలా.. నేను చెబితే పొగరు అనుకోవద్దు.. విజయ్ దేవరకొండ

    |

    సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రం ఆగస్టు 25వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్, టీజర్లు, ప్రమోషన్స్ భారీ అంచనాలు పెంచాయి. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే మీడియాతో మాట్లాడారు. లైగర్ సినిమా గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

    దేశస్థాయిలో కథలు చెప్పాలని

    దేశస్థాయిలో కథలు చెప్పాలని

    పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల సమయంలో ప్రేక్షకులు పంచిన ప్రేమ ఇంకా గుర్తు ఉంది. ఒకప్పుడు యాక్టర్ కావాలని కలలుకనే వాడిని. చిన్న సినిమాలు చేయాలని నేను తరుణ్ కలలు కన్నాం. మీరు చూపించిన ప్రేమతో దేశం మొత్తానికి కథలు చెప్పాలని హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాం. లైగర్ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. గట్టిగానే కొట్టబోతున్నాం. మీ అందరికి నచ్చే సినిమా. మీకు అనుభూతిని పంచుతుంది అని విజయ్ దేవరకొండ తెలిపారు.

    పూరీ జగన్నాథ్‌ను కలిసేందుకు..

    పూరీ జగన్నాథ్‌ను కలిసేందుకు..

    నేను యాక్టర్‌గా ట్రై చేస్తున్నప్పుడు చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. కానీ అవకాశం రాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ట్రై చేశాను. తేజ వద్ద నేను పనిచేశాను. అయితే అసిస్టెంట్ డైరెక్టర్లకు జీతం ఎక్కువ ఇచ్చే వారు కాదు. అయితే మా నాన్న నాకు సలహా ఇస్తూ.. పూరీ జగన్నాథ్ వద్దకు వెళ్లు.. అసిస్టెంట్ డైరెక్టర్లకు మంచిగా పే చేస్తారని చెప్పారు. దాంతో ఆయన ఆఫీస్‌కు వెళ్తే బిజీగా ఉండటం వల్ల కలువలేదు. డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత పూరీ కథ చెప్పారు. లైగర్‌తో ఇంత వరకు వచ్చాం అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

    నత్తి వల్లే కిక్ ఉంటుంది

    నత్తి వల్లే కిక్ ఉంటుంది


    లైగర్ సినిమాలో అన్నింటి కంటే నత్తి వల్లే ఎక్కువ మజా వస్తుంది. స్క్రిప్టు‌లో హైలెట్ నత్తి వల్లే వచ్చింది. నత్తివల్లే డ్రామా బాగా పండింది. షూట్‌లో నాకు బాగా కిక్ ఇచ్చింది. వాట్ లాగ దే లాంటి డైలాగ్స్ చెప్పడానికి కొంత కష్టమైంది. మూడు నాలుగు రోజుల తర్వాత సెట్ అయింది. అక్కడి నుంచి డైలాగ్స్ బుల్లెట్ల వచ్చాయి అని విజయ్ దేవరకొండ అన్నాడు.

    ప్రతీ సీన్ హై..

    ప్రతీ సీన్ హై..

    లైగర్ మూవీలో టెర్రిఫిక్ కంటెంట్ ఉంది. ప్రతీ సీన్ హై.. ఒక సీన్ అయిపోగానే.. మరో సీన్ హైలో ఉంటుంది. అమేజింగ్ ఫెర్ఫార్మెన్సెస్. బాహుబలితో రమ్యకృష్ణకు మంచి పాపులారిటి ఉంది. ఉత్తరాదిలో రమ్యకృష్ణను బాగా ప్రేమిస్తారు. ఆవిడ దక్షిణాది నుంచి వచ్చిన ఆమెకు మంచి ఆదరణ ఉంటుంది. అలాగే నన్ను, గెటప్ శ్రీను ప్రేమిస్తారు. బాలీవుడ్‌ నుంచి అనన్య పాండే ఉంది అని విజయ్ దేవరకొండ అన్నాడు.

    ప్రేక్షకుడు థియేటర్‌లో అడుగు పెట్టిండంటే

    ప్రేక్షకుడు థియేటర్‌లో అడుగు పెట్టిండంటే

    లైగర్ బాక్సాఫీస్ షేక్ చేయడానికి మనం చేయాల్సిన పని కేవలం ప్రేక్షకులను రప్పించడమే. లైగర్ సినిమా కంటెంట్ అలా ఉంది. ఒక్కసారి ప్రేక్షకుడు థియేటర్‌లోకి అడుగుపెట్టాడంటే.. ఆలోచించాల్సిన పనిలేదు. ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే లైగర్ హిట్‌ను ఆపడం ఎవరితరం కాదు. నాకు సినిమా హిట్ అవుతుందనిపిస్తే.. నేను చెప్పేస్తాను. కానీ అందరూ వీడికి పొగరు అనుకొన్నారు. నాకు నచ్చింది మాట్లాడటమే తెలుసు అని విజయ్ దేవరకొండ ఆత్మ విశ్వాసంతో అన్నాడు.

    మైక్ టైసన్ ఎలా వచ్చాడంటే...

    మైక్ టైసన్ ఎలా వచ్చాడంటే...

    లైగర్ సినిమా కథ చెప్పినప్పుడు టైసన్ లాంటి వ్యక్తి ఉంటాడని రెఫరెన్స్ ఇచ్చాడు. అయితే అప్పుడు మైక్ టైసన్ ఉంటాడని అనుకోలేదు. ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత సినిమా బాగా వస్తుంటే.. కంపల్సరీ టైసన్‌ను తీసుకు రావాలని డిసైడ్ అయ్యాం. టైసన్‌ను తీసుకు రావడానికి ఒక సంవత్సరం పట్టింది. ఇది బాక్సింగ్ నేపథ్యంగా సినిమా కాదు. ఇది లవ్ స్టోరి అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

    English summary
    Puri Jagannadh's Liger movie is set to release on August 25th. In this occassion, Vijay Deverakonda speak about his movie and journey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X