twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా కావాలా? జీవితం కావాలా అని అడిగారు.. చైల్డ్‌హుడ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి రామ్

    |

    ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ హీరో 'ఉస్తాద్' రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌ మీడియాతో మాట్లాడుతూ..

    ఇంట్లో వాళ్లు నాపై డౌట్ పడ్డారు..

    ఇంట్లో వాళ్లు నాపై డౌట్ పడ్డారు..


    నా బాల్య స్నేహితురాలి గురించి నేను ఏం చెప్పాలి? మీరే రాశారు. ఆ అమ్మాయిని అడిగి మీరే నాకు చెప్పండి. నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే... సీక్రెట్చైల్డ్‌హుడ్‌ గాళ్ ఫ్రెండ్ అని రాశారు. ఇంట్లో వాళ్ళు కూడా డౌట్ డౌట్ గా చూడటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ కూడా నెమ్మదిగా 'మాకే తెలియకుండా ఏంటిది?' అని ఫోన్స్ చేయడం స్టార్ట్ చేశారు. 'ఏం లేకుండా రాస్తారంటావా?' అనే ప్రశ్నను అమ్మ వేసింది. అందుకని, జెన్యూన్ గా అడిగా... నేను స్కూల్‌కి ఎప్పుడు వెళ్లానని! అని రామ్ తెలిపారు.

     వెన్నుముకకు గాయం కావడంతో

    వెన్నుముకకు గాయం కావడంతో


    వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిపోవడంపై రామ్ స్పందించారు. నాకు వెన్నుముకకు గాయమైన సమయంలో ఫ్యాన్స్ అండగా ఉన్నారు. అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ది వారియర్ సినిమా షూటింగులో నా వెన్నుముకకు తీవ్రమైన గాయమైంది. ఎడమ చేయి పనిచేయలేదు. దాదాపు మూడు నెలలు విశ్రాంతి తీసుకొన్నాను అని రామ్ తెలిపారు.

    జీవితం కావాలా? సినిమా కావాలంటే?

    జీవితం కావాలా? సినిమా కావాలంటే?


    నాకు గాయమైన సమయంలో ది వారియర్ షూట్ ఆగిపోయింది. ఆది పినిశెట్టి డేట్స్ సమస్య తలెత్తే పరిస్థితి కనిపించింది. అప్పటికే ఆది చాలా సినిమాలు వదులుకొన్నాడు. ఆ సమయంలో డాక్టర్ వద్దకు వెళ్లి సినిమా చేస్తానని సలహా అడిగాను. దాంతో మీకు జీవితం ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా? అని డాక్టర్ ప్రశ్నించారు. అయితే నా కోసం సినిమా షూటింగ్ వాయిదా పడటం.. అలాగే నా వల్ల ఇతరులు వెయింటింగ్ చేయాల్సిన పరిస్థితి రావడం కష్టంగా అనిపించింది. అయితే సినిమానే లైఫ్ అనుకొనే నాకు అది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ మాదిరిగా అనిపించింది అని రామ్ ఎమోషనల్ అయ్యారు.

    పది కోట్ల మంది కనిపిస్తారు అంటూ

    పది కోట్ల మంది కనిపిస్తారు అంటూ


    మోకాలికి గాయమైనా సాంగ్ షూటింగ్ చేశాను. అవసరం లేదని చాలా మంది అంటున్నారు. దర్శకులు కూడా అదే మాట అన్నారు! కానీ, ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోసం చేయాలని నాకు అనిపించడం వల్లే చేస్తున్నాను.సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే... నేను చేయగలననే ఫీలింగ్ వస్తే 100 పర్సెంట్ చేయాల్సిందే అని రామ్ అన్నారు.

    హిందీ కోసం ప్రత్యేకంగా ఏం చేయడం లేదు

    హిందీ కోసం ప్రత్యేకంగా ఏం చేయడం లేదు


    హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయకూడదని నేను నమ్ముతా. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తున్నారు. తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసం! మనంక‌న్‌ఫ్యూజ్‌ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు. హిందీలో డబ్బింగ్ అయినప్పుడు చూశారు.

    English summary
    Filmmaker N Lingusamy’s bilingual movie ‘Warriorr’, produced by Srinivasaa Chitturi of Srinivasaa Silver Screen, featuring Ram Pothineni and Kriti Shetty is scheduled for worldwide theatrical release on July 14, 2022. Here is the Ram Pothineni Interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X