X
తెలుగు » సినిమాలు » 2 కంట్రీస్
2 కంట్రీస్

2 కంట్రీస్

Comedy | Romance | 29 Dec 2017 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

2 కంట్రీస్ స్టోరీ

2 కంట్రీస్ సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్ కథానాయకుడిగా ఇంక నరేష్, సాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస రెడ్డి, దేవ్ గిల్, శివా రెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు నటించారు. ఈ సినిమాని శంకర్ స్వియ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్ అందించారు.  కథ ఉల్లాస్ కుమార్ డబ్బు కోసం ఏదైనా చేసే మనస్తత్వం. రాజకీయ నేతలను బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసేంత డబ్బు పిచ్చి. కట్నం భారీగా వస్తుందని అంగవికలురాలైన పటేల్ (షియాజీ షిండే) చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతాడు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉండే లయ (మనీషా రాజ్)తో పెళ్లి కుదరడంతో పటేల్ చెల్లెల్ని కాదంటాడు. ఉల్లాస్‌ను లయ పెళ్లి చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంటుంది. అలా భార్యగా మారిన లయ మద్యానికి బానిస. ఆ విషయం పెళ్లి తర్వాత తెలుస్తుంది. అమెరికాకు వెళ్లిన తర్వాత ఓ కారణంగా ఉల్లాస్‌ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్తుంది. ఉల్లాస్‌, లయకు కోర్టు విడాకులు మంజూరు చేసిందా? విడాకులు తీసుకొన్న తర్వాత ఉల్లాస్ పరిస్థితి ఏమిటి? లయ ఎందుకు విడాకులు కోరింది? ఏపీలోని వెంకటాపురం అనే గ్రామంలో ఉండే ఉల్లాస్‌ను అమెరికాకు చెందిన లయ ఎందుకు పెళ్లి చేసుకొన్నది? విడాకులు తీసుకొన్న ఉల్లాస్, లయ జీవితానికి క్లైమాక్స్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 2 కంట్రీస్ మూవీ కథ.
Read More

2 కంట్రీస్ కాస్ట్ & క్రూ

2 కంట్రీస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎన్‌ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత ఎన్‌ శంకర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

2 కంట్రీస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తొలిభాగంలో సునీల్‌కు డబ్బు పిచ్చి ఎంత ఉందనే కోణాన్ని చూపించడంతో కథ ప్రారంభమవుతుంది. సునీల్ పైసల కోసం ఎంతకైనా తెగిస్తాడనే విషయాన్ని ఆవిష్కరించడానికి రాజకీయాలు, ఇతర అంశాలతో కథ చాలా నిస్సారంగా సాగుతుంది. సునీల్ తరహా రొటీన్ కామెడీ, పంచులతో వ్యవహారమంతా చాలా సాదాసీదా మారుతుంది. ఇక భార్యభర్తల మధ్య కలహాలు అనే చిన్న పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌ కార్డు పడుతుంది. ఆ తర్వాత కథ అమెరికాకు చేరుతుంది. అమెరికాలో వివాహ సంబంధాలు, యాంత్రిక జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక రెండో భాగంలో 30 నిమిషాల అనంతరం అసలు కథ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కథపై, సన్నివేశాలలో ఉండే భావోద్వేగాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. ప్రీక్లైమాక్స్ ప్రేక్షకులను కొంత ఎమోషనల్ పాయింట్లను టచ్ చేస్తుంది. భార్యభర్తలు ఒక్కటయ్యే రొటీన్ క్లైమాక్స్‌తో ముగింపు కార్డు పడుతుంది. 2 కంట్రీస్ విషయానికి వస్తే ఫస్టాఫ్ మైనస్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌‌లో అమెరికాలో తెరకెక్కించిన సన్నివేశాలు కథకు బలాన్ని ఇచ్చేలా ఉంటాయి. కథలో ఉండే భావోద్వేగాన్ని చక్కగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ప్రేక్షకుల సహనం, ఓపికకు పరీక్ష తారాస్థాయికి చేరుకోవడం వల్ల సినిమాపై పట్టు సడలినట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా కథలో ఉండే మంచి పాయింట్‌ను ఆసక్తికరంగా మలచకపోవడమనేది ఈ చిత్రానికి ప్రధానలోపం అనేది మెజారిటి ప్రేక్షకుల అభిప్రాయం.

2 కంట్రీస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

2 కంట్రీస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+