X
తెలుగు » సినిమాలు » అదిరింది
అదిరింది

అదిరింది

Action | 09 Nov 2017 | 150 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

అదిరింది స్టోరీ

అదిరింది సినిమా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందించారు. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు ఇది యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, ఎస్ జె సూర్య, సత్యరాజ్, వడివేలు, సత్యన్, మిషా గోషల్, కోవై సరళ, యోగి బాబు, హరీష్ పెరడి, రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం అట్లీ వహిస్తున్నారు మరియు నిర్మాత రామసామి ఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించారు.  కథ డాక్టర్ మారన్ (విజయ్) నిస్వార్థపరంగా వైద్య వృత్తిని కొనసాగిస్తుంటాడు. కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందిస్తుంటాడు. వెట్రి (విజయ్) పాపులర్ మెజిషియన్. డాక్టర్ మారన్ అందించిన అత్యుత్తమ వైద్య సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ దేశం అవార్డు ప్రకటిస్తుంది. ప్యారిస్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకొంటాడు. అదే సమయంలో వెట్రీ మ్యాజిక్ ప్రదర్శన ప్యారిస్‌లో జరుగుతుంది. మ్యాజిక్ ప్రదర్శనలో భాగంగా ప్రపంచ గుర్తింపు పొందిన డాక్టర్‌ను వెట్రీ చంపి పగ తీర్చుకొంటాడు. డాక్టర్‌ను చంపిన వెట్రీ కూడా మారన్ మాదిరిగా ఉండటంతో మారన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. మారన్ అరెస్ట్‌ను చూసి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన డేనియల్ (ఎస్‌జే సూర్య) కంగుతింటాడు. ఆ తర్వాత మారన్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. మారన్‌ను డేనియల్ ఎందుకు చంపాలనుకొంటాడు? మారన్‌ను చూసి భయపడాల్సిన అవసరం డేనియల్ ఎందుకు ఏర్పడింది. ఇక ఈ కథకు కాజల్ అగర్వాల్, సమంత, నిత్యమీనన్ ఏ విధంగా తోడ్పాడ్డాడు అనే విషయాలకు సమాధానమే మెర్సల్ చిత్రం.
Read More

అదిరింది కాస్ట్ & క్రూ

అదిరింది సిబ్బంది సమాచారం

దర్శకత్వం అట్లీ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత రామసామి ఎన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అదిరింది విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సేవ కోసం కాకుండా పక్కా బిజినెస్‌గా మారిన వైద్య వృతిపై దర్శకుడు సంధించిన సినీ విమర్శనాస్త్రం మెర్సల్ చిత్రం. వైద్య రంగంలో జరిగే కమీషన్ల దందా, ప్రైవేట్ హాస్పిటల్స్ దందాను దర్శకుడు అట్లీ కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ రకమైన కథకు హృదయాన్ని పిండి వేసే సన్నివేశాలను బలంగా రాసుకోన్నాడు. సినిమా తొలి భాగంలో యాక్సిడెంట్ గురైన ఓ బాలిక ఎపిసోడ్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేతగా ఉంది. డబ్బుకు ఆశపడి కొందరు వైద్యులు చేసే దుర్మార్గాలను పచ్చిగా చూపించాడు. విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ సన్నివేశాలు తెరపై అద్భుతంగా ఉంటాయి. ప్రతీ పది నిమిషాలకు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఓ గ్రామ పెద్ద వెట్రి మారన్ (విజయ్) కథ ఫ్లాష్ బ్యాక్‌తో ఆరంభమవుతుంది. పేదల కోసం పరితపించే వెట్రీ మారన్ క్యారెక్టర్ చక్కగా డిజైన్ చేశాడు. ఇక వెట్రీ మారన్ భార్య (నిత్యమీనన్) నటన సెకండాఫ్‌కు ప్రాణం పోసింది. గర్భవతి అయిన నిత్య మీనన్ వైద్యుల దుర్మార్గానికి గురై ప్రాణాలు కోల్పోయే ఎపిసోడ్ సినిమాకు హైలెట్. వెట్రీ మారన్ చనిపోయే ఎపిసోడ్‌లో యాక్షన్ పార్ట్ అద్భుతంగా చిత్రీకరించారు. ఎమోషనల్‌గా సాగే కథలో ప్రతీ సన్నివేశం సినిమాను మరో మెట్టును ఎక్కించే విధంగా ఉన్నాయి. చక్కటి స్క్రీన్ ప్లేతో దర్శకుడు తన ప్రతిభ ఆకట్టుకునేలా ఉంటుంది.

అదిరింది సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అదిరింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+