అమర్ అక్బర్ ఆంటోనీ స్టోరీ
అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, అను ఎమ్మాన్యుల్, సునీల్, లయ, శ్లోక (లయ కుమార్తె), మహాధన్ (రవితేజ కుమారుడు), అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్ జీత్ సింగ్, రాజ్ వీర్ సింగ్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్, శుభలేఖ సుధాకర్, దివ్య ఉన్ని, సిజొయ్ వర్గీసి, భరత్ రెడ్డి, గిరిధర్ తదితరులు ముఖ్యపాత్రలు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనువైట్ల వహించారు మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందించారు. కథ అమెరికాలో ఓ ఫార్మా కంపెనీ అధినేత కుమారుడు అమర్ (రవితేజ). వ్యాపారంలో తండ్రి భాగస్వామి కూతురు ఐశ్వర్య (ఇలియానా). రెండు కుటుంబాల మధ్య అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉంటాయి. బిజినెస్‌లో మరో నలుగురు (తరుణ్ అరోరా తదితరుల) పార్ట్‌నర్స్ మోసం వల్ల చిన్నతనంలోనే అమర్, ఐశ్వర్య తమ కుటుంబాలను కోల్పోతారు. అనుకోని కారణాల వల్ల వారిద్దరూ విడిపోతారు. పెరిగి పెద్దయిన తర్వాత తమ కుటుంబాన్ని వంచన చేసి.. తమను అనాధలుగా చేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారనేది చిత్ర కథ. ఇక ఈ కథలో అమర్ మినహాయించి అక్బర్.. ఆంథోని పాత్రలేంటి? చిన్నతనంలో విడిపోయిన అమర్, ఐశ్వర్య ఎలా కలుసుకొన్నారు? తమ కుటుంబానికి ద్రోహం చేసిన ఆ నలుగురు విలన్లను ఏరకంగా చంపారు? ఈ చిత్రంలో షియాజీ షిండే పాత్ర ఏంటి? సునీల్ కమెడియన్‌గా ఆకట్టుకొన్నారా? సత్య, వెన్నెల కిషోర్ ఏ విధంగా వినోదాన్ని పంచారనే ప్రశ్నలకు సమాధానమే అమర్ అక్బర్ ఆంటోని.
Read More