X
తెలుగు » సినిమాలు » తొలిప్రేమ
తొలిప్రేమ

తొలిప్రేమ

Romance | 10 Feb 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

తొలిప్రేమ స్టోరీ

తొలిప్రేమ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, రాశీ ఖన్నా, ప్రయదర్షి, సప్న పబ్బి, సుహాసిని, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకీ అట్లూరి వహించారు మరియు నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.  కథ ఆదిత్య శేఖర్ (వరుణ్ తేజ్) మనసుకు నచ్చింది చేసే ముక్కుసూటి మనస్తత్వం ఉన్న యువకుడు. ట్రైయిన్‌లో వర్ష (రాశీఖన్నా) తారసపడిన మరుక్షణమే తొలి ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజీలో చేరుతారు. అంతా సవ్యంగా జరిగిపోతున్న సమయంలో ఓ కారణంగా వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆరేళ్లకు లండన్‌లో కలుసుకొంటారు. ఎంతో గాఢంగా ప్రేమించుకొన్న ఆదిత్య, వర్ష విడిపోవడానికి బలమైన కారణమేమిటి? పీకల్లోతు కోపంతో ఉన్న ఆదిత్య వర్ష మళ్లీ కలుసుకొన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? వారి మధ్య విభేదాలు, కోపతాపాలు తగ్గి మళ్లీ ఒక్కటైపోవడానికి ఎలాంటి పరిస్థితులు, సంఘటనలు వారి జీవితంలో చోటుచేసుకొన్నాయి. ఆదిత్యపై ప్రేమను రుజువు చేసుకోవడానికి వర్ష ఏ విధంగా స్పందించింది. వర్షపై తనకు ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి ఆదిత్య ఏమి చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే తొలిప్రేమ కథ.
Read More

తొలిప్రేమ కాస్ట్ & క్రూ

తొలిప్రేమ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెంకీ అట్లూరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తొలిప్రేమ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వరుణ్, రాశీల మధ్య తొలిప్రేమ రైల్లో పుట్టడం ద్వారా వారి జీవితం ప్రారంభమవుతుంది. ఓకే కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, సహచరులు మధ్య ఆటపట్టించే సన్నివేశాలతో చకచక కథ సాగిపోతుంటుంది. ప్రేమలో ఇష్టాఅయిష్టాలను, ప్రేమానురాగాలను చిన్న సంఘటనలు, సన్నివేశాల ద్వారా సినిమా ఆసక్తిగా మారుతుంది. ఓ ఇగో కారణంగా వరుణ, రాశీ విడిపోవడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌లో బ్రేకప్ మెమోరీస్ నుంచి బయటపడటానికి ఆదిత్య లండన్‌కు వెళ్లిపోతాడు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని తన ప్రాణస్నేహితుడు ప్రియదర్శితో, ఇతర స్నేహితులతో ఉద్యోగంలో చేరిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఆదిత్య జీవితంలోకి వర్ష మళ్లీ ప్రవేశిస్తుంది. వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురించి ఒక్కటవ్వడం ద్వారా సినిమా ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌తో ముగుస్తుంది. ఫైనల్ గా.. ప్రస్తుత జనరేషన్‌లో కనిపించే సంఘటనలే తొలిప్రేమ చిత్రం కథ. ఈ కథలో వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరూ పోటాపోటీగా నటించడం వల్లే సినిమాకు ఓ ఫీల్‌ ఫ్యాక్టర్ జనరేట్ అయింది అనిచెప్పవచ్చు. క్యాటగిరీలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను టచ్ చేసే సినిమా తొలిప్రేమ. ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ అని తెలుసుకోవాలంటే రెండు రోజుల తర్వాత మోగే రికార్డుల మోతే చెబుతుంది.

తొలిప్రేమ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

తొలిప్రేమ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+