X
టైగర్

టైగర్

Romance | 26 Jun 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

టైగర్ స్టోరీ

టైగర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్‌ కిషన్‌, సీరత్‌కపూర్‌, రాహుల్‌ రవీంద్రన్‌ , తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు  తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనంద్ నిర్వహించారు మరియు నిర్మాతలు మధు బి, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ యస్ స్వరాలు సమకు్ర్చారు.  కథ విష్ణు (రాహుల్ రవీంద్ర), జై అలియాస్ టైగర్(సందీప్ కిషన్) ఇద్దరూ అనాధలు..అలాగే బెస్ట్ ఫ్రెండ్స్. టైగర్ కు ఆర్య-2 లో అల్లు అర్జున్ కి నవదీప్ మీద స్నేహతో కూడిన ప్రేమ ఉన్నట్లు..విపరీతమైన ప్రేమ. కానీ విష్ణు మాత్రం...అందులో నవదీప్ లాగే...టైగర్ ని..ఓ తలనొప్పిలా ఫీలవుతూంటాడు. ఇలా ఇద్దరూ ఎవరి అభిప్రాయాలతో పెరిగి పెద్దైన తర్వాత...విష్ణు...ఓ సుముహుర్తాన గంగ (సీరత్ కపూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కాశీ కి సంభందించిన అమ్మాయి. అక్కడ కులం కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి. తమ కులం అమ్మాయి ...వేరే వారితో ప్రేమలో పడితే పరువు హత్యలు చేసేస్తూంటారు. అందులో భాగంగా.....విష్ణు నికూడా చంపేయటానికి ఎటాక్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న టైగర్...తన ఫ్రెండ్ తనని తలనొప్పిగా భావించినా సరే...తనకు ఆప్తమిత్రుడు, ప్రాణం కాబట్టి అతన్ని సేవ్ చేయటానికి కాశీ వస్తాడు. అక్కడ పరువు హత్యలను ఎలా ఎదిరిస్తాడు.. వాళ్లిద్దరినీ ఎలా కలుపుతాడు అనేది మిగతా కథ.
Read More

టైగర్ కాస్ట్ & క్రూ

టైగర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనంద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత మధు బి, ఎన్ వి ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

టైగర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పరువు హత్యలమీద సినిమాలు మనకు తక్కువే. ఆ మధ్యన అల్లు శిరీష్ హీరోగా 'గౌరవం' వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇదిగో ఈ టైగర్ రంగంలోకి దిగింది. అయితే ఉత్తరప్రదేశ్ లో జరిగే పరువు హత్యలను మన తెలుగు కుర్రాడు వెళ్లి ఆపే లైన్ వినటానికి బాగానే ఉంటుంది. కానీ అదే సింగిల్ పాయింట్ ఎజెండా గా సినిమాకు సరపడ కథ వస్తుందా లేదా అని దర్శకుడు చూసుకోవాల్సింది. దానికి తోడు ఈ చిత్రం సందీప్ కిషన్ హీరో అని ఫిక్సై వెళతాం...అయితే రాహుల్ రవీంద్ర లవ్ స్టోరీ తో ఫస్టాఫ్ ని రన్ చేసి మనని డైలమోలో పడేస్తాడు. అతని ప్రేమకథకు సహాయపడే పాత్ర...సందీప్ కిషన్ ది అని అర్దమవుతుంది. సెకండాఫ్ మొత్తం సందీప్ కిషన్..వంటిచేత్తో..కాశీలోని విలన్స్ తో పోరాడుతూంటాడు. అయితే అతనికి ఎక్కడా బలమైన ప్రత్యర్దులు తగలరు. దాంతో సందీప్ కిషన్ పాత్ర చాలా పాసివ్ గా నడుస్తుంది.

టైగర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

టైగర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+