»   » పూరీ నడుంపై గిల్లిన సినీ నటి హేమ.. గ్లామర్‌తో హల్‌చల్.. జ్యోతిలక్ష్మి2‌కు రెడీనా?

పూరీ నడుంపై గిల్లిన సినీ నటి హేమ.. గ్లామర్‌తో హల్‌చల్.. జ్యోతిలక్ష్మి2‌కు రెడీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన యాక్టర్లలో నటి హేమ ఒకరు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తారు. కామెడీగానీ, సీరియస్ క్యారెక్టర్ గానీ, అక్కా, చెల్లె, వదిన, ఏ పాత్రనైనా తన మార్కు కనబడేటట్టు నటిస్తారు. ఆమెలో ఉన్న నటనను ఇంకా పూర్తిస్థాయిలో ఇండస్ట్రీ ఉపయోగించుకోలేదనే మాట అప్పడప్పుడు వినిపిస్తుంటుంది. షూటింగ్‌లో గానీ, సినీ వేడుకలైనా గానీ హేమ హడావిడి బాగానే కనిపిస్తుంటుంది. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పేస్తుంది. తాజాగా సంప్రదాయంగా చీరకట్టుతో శమంతకమణి ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన హేమ్ ఆ కార్యక్రమంలో హల్‌చల్ చేసింది.

శమంతకమణి ప్రీరిలీజ్‌లో హేమ హల్‌చల్

శమంతకమణి ప్రీరిలీజ్‌లో హేమ హల్‌చల్

తాజాగా శమంతకమణి సినిమా ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన సినీ నటి హేమ అందర్ని ఆకర్షించింది. సంప్రదాయంగా కట్టుబొట్టు, కొప్పులో పూలు బ్రహ్మండంగా కుదిరాయి. చూడగానే తెలుగు ఆడపడుచులా కనిపించి ఆకట్టుకొన్నది.

హీరోయిన్లను తలదన్నేలా హేమ గ్లామర్

హీరోయిన్లను తలదన్నేలా హేమ గ్లామర్

చీరకట్టులో వచ్చిన హేమ హీరోయిన్లను తలదన్నేలా వేదిక మీద కనిపించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన వారంతా హేమ హీరోయిన్‌లా కనిపించింది అనే అనుకోవడం జరిగింది. వేదిక మీద కూడా కలివిడిగా అందరిని పలుకరిస్తూ హడావిడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూరితో అత్యంత చనువుగా వ్యవహరించడం అందర్ని ఆకట్టుకొన్నది.

పూరీతో మంచి అనుబంధం.

పూరీతో మంచి అనుబంధం.

వాస్తవానికి పూరీ జగన్నాథ్‌కు, హేమకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. పూరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి హేమకు పరిచయం ఉంది. పూరీ తనకు ఆత్మీయుడు అని పలు సందర్భాల్లో ఆమె చెప్పింది.

వేదికపై హడావిడి, కలివిడితనం

ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పూరీకి ఫోన్ ఇచ్చి నంబర్ తీసుకోవడం కనిపించింది. వేదిక మీద వక్తలు మాట్లాడుతుండగానే వారు తమ మాటల్లో పడిపోయారు. ఏదో మాటకు స్పందించిన పూరీ హేమను ఆత్మీయంగా కౌగిలించుకొన్నారు. దానికి బదులుగా పూరిని కూడా హేమ కౌగిలించుకొని నడుము మీద గిల్లడం స్పష్టంగా కనిపించింది. దీనిని పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు గానీ, వారిద్దరి మధ్య అనుబంధం ఏమిటో పూర్తిగా స్పష్టమైంది.

జ్యోతిలక్ష్మి2 సినిమాకు రెడీనా?

జ్యోతిలక్ష్మి2 సినిమాకు రెడీనా?

వేదిక మీద హేమను చూస్తే జ్యోతిలక్ష్మిలో చార్మీలా కనిపించింది. ఒకవేళ జ్యోతిలక్ష్మి2 తీస్తే సరిగ్గా హేమ సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటి నుంచో ఫుల్ లెంగ్త్ పాత్రను పోషించాలని ఎదురు చూస్తున్న హేమకు ఆ విధంగానైనా అదృష్టం కలిసి వస్తుందేమో వేచి చూద్దాం.

English summary
Actor Hema and Director Puri Jagannadh has good relation. The met recently on occassion of Shamantakamani Pre Release event. The closely associated each other on dias of Shamantakamani event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu