»   » షూటింగ్ గ్యాపులో గదిలోకి పిలిచే కామాంధులున్నారు: నటి అపూర్వ సంచలనం

షూటింగ్ గ్యాపులో గదిలోకి పిలిచే కామాంధులున్నారు: నటి అపూర్వ సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండస్ట్రీలో సీనియర్ నటుడు చలపతి రావు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇండస్ట్రీలో కొందరు తాతల వయసులో ఉన్న వారు షూటింగ్ గ్యాపులో గదిలోకి రమ్మని పిలిచే వారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారితో పోల్చితే చలపతి బాబాయ్ దేవుడు లాంటి వారని ఆమె తెలిపారు.

చలపతి రావు మహిళల పట్ల అమర్యాదగా, నీచంగా ప్రవర్తించే వ్యక్తి కాదని, ఆయన ఎంతో మంచి వారని ఆమె అన్నారు. ఆ రోజు ఆయన ఏదో పొరపాటుగా అలా అని ఉంటారని అపూర్వ చెప్పుకొచ్చారు.

కామాంధులు

కామాంధులు

ఇండస్ట్రీలో తాతయ్యల వయసులో ఉన్న వారు అమ్మాయిలను పక్కన కూర్చో బెట్టుకుని, వాళ్ల మీద చేతులు వేసి కబుర్లు చెబుతూ, విరామ సమయంలో గదిలోకి రమ్మని ఆదేశించే వాళ్లు చాలా మందే ఉన్నారని అపూర్వ తెలిపారు.

చలపతి మంచి మనసు

చలపతి మంచి మనసు

ఇండస్ట్రీలో ఉన్న అలాంటి కామాంధులతో పోల్చితే బాబాయ్ చలపతిరావు దేవుడి వంటి వాడని, ఆయన కష్టాల్లో ఉన్న వేళ, ఆయనంటే తెలియని వారు కూడా మంచిగా చెబుతుంటే, చుట్టు పక్కల ఉన్న వాళ్లు ముందుకొచ్చి, ఆయన మంచి మనసును గురించి చెప్పడం లేదెందుకని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

నిజం చెప్పండి

నిజం చెప్పండి

చలపతిరావు ఎలాంటి వారో అందరికీ తెలుసు. ఆయన గురించి కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన గురించి, ఆయన మంచి తనం గురించి తెలిసిన వారు మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన సమయం ఇదే అని అపూర్వ అన్నారు.

చలపతిరావు వివాదం: మా నాన్నను చంపేయండన్న రవి బాబు!

చలపతిరావు వివాదం: మా నాన్నను చంపేయండన్న రవి బాబు!

‘రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావు మహిళలపై చేసిన కామెంట్స్ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో ఆయన కొడుకు రవి బాబు స్పందిస్తూ... మా నాన్నను చంపేయండన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు అని యాంకర్ రవి.... చలపతి రావు వివాదంపై స్పందించారు.

English summary
Actress Apoorva about Chalapathi Rao comments. A actress became emotional and tried to defend Chalapathi Rao citing some examples.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu