For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శవాలకు డెకరేషన్ అవసరమా? ఆ రిలేషన్‌లో సెక్స్ ఉండదు.. హీరోయిన్ తోసేసింది.. రమాప్రభ

  By Rajababu
  |
  Rama Prabha About Present Actors Behaviour

  తెలుగు సినిమా చరిత్రలో ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రస్తావిస్తే ఆమె కేరీర్ ప్రత్యేకమైన అధ్యాయంగా మారుతుంది. ఆమె నటించని పాత్ర లేదు. వేయని వేషం లేదు. ప్రతిభకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఎస్వీరంగారావు, సావిత్రి, వాణిశ్రీ, రాజబాబు, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ లాంటి ఎందరో దిగ్గజ నటీనటులతో నటించారు. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి గొప్ప నటిగా పేరుతెచ్చుకొన్నారు. ప్రస్తుతం పరిశ్రమకు దూరమై మదనపల్లిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను, కష్టాలను ప్రేక్షకులతో పంచుకొన్నారు. రమాప్రభ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

  ఏకాంత జీవితం కోసమే

  ఏకాంత జీవితం కోసమే

  నేను ఎంతో సంపద చూశాను. ఇప్పుడు నా వద్ద డబ్బు లేకపోవచ్చు. ఇప్పుడు రమాప్రభ ఒంటరి కావొచ్చు. నాకు ఎవరితో సంబంధాలు లేకపోవచ్చు. అందుకే ఏకాంతంగా ఉండాలని అనుకొన్నాను. ఆ కారణంగానే నేను హైదరాబాద్ నుంచి మదనపల్లికి వచ్చాను.

   నాగార్జున, పూరీ ఆదుకొన్నారు

  నాగార్జున, పూరీ ఆదుకొన్నారు

  నా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని నాగార్జున బాబు, పూరీ జగన్నాథ్ నన్ను ఆదుకొన్నారు. ప్రతి నెల 5 తేదీ లోపు నా బ్యాంకు అకౌంట్‌లో పూరీ బాబు డబ్బులు వేస్తారు. ముందు నా అకౌంట్‌లో ఎవరు డబ్బు వేస్తారనే విషయం కూడా తెలీదు. బ్యాంక్ క్యాషియర్‌ను అడిగి తెలుసుకున్నాను.

   జయలలితకు దూరం

  జయలలితకు దూరం

  జయలలితతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. చాలాసార్లు రమ్మని కాల్ చేశారు. కానీ మధ్యవర్తుల వల్ల సాధ్యపడలేదు. కొందరి చేష్టల వల్ల దూరమయ్యాం. శశికళ తదితరులు నన్ను ఏం కావాలి.. ఎందుకు వచ్చారు అని ప్రశ్నించినపుడు హర్ట్ అయ్యాను. అందుకే జయలలితకు దూరంగా ఉన్నాను.

   ఎంతో జీవితాన్ని చూశాను

  ఎంతో జీవితాన్ని చూశాను

  చెన్నైలో నా కెరీర్‌లో ఎంతో జీవితాన్ని చూశాను. కేవలం డ్యూయెట్లు చేస్తే హీరోయిన్లా? ఇప్పటి హీరోయిన్ల కంటే ఎక్కువగా వెరైటీ రోల్స్ వేశాను. నేను వేసిన పాత్రలు కొందరు వారి జీవితంలో వేయలేదు. వేయలేరు. ఇప్పుడు ఉన్న హీరోయిన్లకు సరైన అవగాహన లేదు.

   జూనియర్ ఆర్టిస్టు కంటే హీనంగా

  జూనియర్ ఆర్టిస్టు కంటే హీనంగా

  ఇప్పటి తరం నటీనటులకు నాలాంటి సీనియర్ నటులను గౌరవించడం తెలీదు. నా గురించి సరిగా తెలియని వాళ్లు ఏదో చిన్నచూపు చూస్తారు. ఓ షూటింగ్‌లో ఓ నటుడు నాతో సరిగా ప్రవర్తించకపోతే అతడిని దమ్ముదులిపాను. కొందరు జూనియర్ ఆర్టిస్టు కంటే ఘోరంగా చూశారు.

  వాళ్లు అడుగు పెడితే దేవుడు పారిపోతాడు

  వాళ్లు అడుగు పెడితే దేవుడు పారిపోతాడు

  తెలుగు వాళ్లు ఏ ఆలయంలో అడుగుపెడితే అక్కడ నుంచి దేవుడు పారిపోతాడు. షిర్డీలో సాయిబాబా ఆలయంలో వీఐపీ సంస్కృతిని పెంపొందించారు. మహారాష్ట్రలో ప్రజలు చాలా పేదవారు. ఆ ప్రాంతాన్ని ఆంధ్రాగా మార్చారు. తిరుపతిలో నాకు ఎప్పుడు చేదు అనుభవం ఎదురవుతుంది. ఆయనకు మాలాంటి భక్తులు ఇష్టం ఉండరు. వెంకటేశ్వరస్వామికి వీఐపీలంటేనే ఇష్టమేమో.

  వారిలో మంచితనం లేదు

  వారిలో మంచితనం లేదు

  నా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని కొందరు దాతలు ముందుకు వచ్చారు. కానీ వారంతా రమాప్రభకు సహాయం చేశాం అని ఏదో ప్రచారం చేసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. వారి మనసులో మంచి తనం లేదు. అలాంటి వారంతా శవాలతో సమానం. మనల్ని మనం గౌరవించుకోకపోతే మనం శవాలమే. అలాంటి శవాలకు డెకరేషన్ అవసరమా? మనుషులకు కావాలి డెకరేషన్.

   రిలేషన్‌లో సెక్స్ ముఖ్యం కాదు

  రిలేషన్‌లో సెక్స్ ముఖ్యం కాదు

  దివంగత అక్కినేని నాగేశ్వరరావుతో నాకు మంచి అనుబంధం ఉంది. మంచి మానవ సంబంధాల మధ్య సెక్స్ ఉండదు. సెక్స్ కావాలంటే ఐదు రూపాయలు ఇస్తే ఏడేళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసులో వారు రోడ్డుపైనా దొరుకుతారు. రిలేషన్‌లో సెక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు.

  ప్రకృతే మమ్మల్ని కలిపింది

  ప్రకృతే మమ్మల్ని కలిపింది

  మన జీవితంలో ప్రకృతిది చాలా ప్రధానమైన పాత్ర. ప్రకృతే మనుషులను కలుపుతుంది. అందుకు ఉదాహరణ అక్కినేని నాగేశ్వరరావు మరణం. మదనపల్లిలో ఉన్న అనారోగ్యంతో ఉన్నాను. ఓ చిన్న ప్రొడక్షన్ హౌస్ డబ్బింగ్ చెప్పమని ఆహ్వానించారు. ట్రైన్ టికెట్లు, రూ.10 వేలు నాకు ఇచ్చారు. మదనపల్లి నుంచి హైదరాబాద్ వచ్చి గెస్ట్ హౌస్‌లో దిగిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు పోయారని వార్త తెలిసింది. నాగేశ్వరరావును చివరిచూపు చేసే అవకాశాన్ని ప్రకృతి ప్రొడక్షన్ హౌస్ రూపంలో ఇచ్చింది.

   ఓ హీరోయిన్ తోసి పారేసింది

  ఓ హీరోయిన్ తోసి పారేసింది

  అక్కినేని నాగేశ్వరరావును చూడటానికి వెళితే కొందరు నన్ను అవమానించారు. పక్కకు తోసి పారేశారు. ఓ హీరోయిన్‌ నన్ను తోసేసింది. టబు, అనుష్క వచ్చి పట్టుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా నాగేశ్వరరావు చాలా అందంగా కనిపించారు. నా 50 ఏళ్లలో నాగేశ్వరరావును అంత అందంగా ఎన్నడూ చూడలేదు. ఆయన ఓ మునిలాగా కనిపించారు అని రమాప్రభ కన్నీటి పర్యంతమైంది.

  English summary
  Rama Prabha is an Indian actress who performs in Telugu language, Tamil and Hindi films. She acted in more than 1400 films. She was credited as a character artist who shared screen space with all generation superstars. Her career spans over four decades. She formed a noted pair on Telugu screen during the 1970s and 1980s with comedian Raja Babu.She acted opposite Nagesh in Shanti Nilayam and many other films from 1968 onwards. She acted in Hindi opposite Mehmood in Do Phool.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more