»   » కొడుకుతో కలిసి బన్నీ లుంగీ అవతార్... తిరుమలలో సందడి (ఫోటోస్)

కొడుకుతో కలిసి బన్నీ లుంగీ అవతార్... తిరుమలలో సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుమల: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బన్నీతో పాటు భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కూతురు అర్హ, అల్లు అరవింద్ దంపతులు సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

కాగా... బన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులను తెగ ఒకట్టుకుంటోంది. శ్రీవారి దర్శనం సందర్బంగా బన్నీ, అయాన్ సాంప్రదాయ పంచకట్టు(లుంగీ) అవతారంలో బయల్దేరారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బన్నీ ఫ్యామిలీ తిరుమలలో సందడి చేసిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.,,,

లుంగీ అవతార్

లుంగీ అవతార్

కొడుకు అల్లు అయాన్ తో కలిసి లుంగీ అవతారంలో అల్లు అర్జున్. ఈ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో వైరల్ అయింది. అల్లు అయాన్ ఫోటో కోసం క్లిక్ చేయండి.

అల్లు అర్హ

అల్లు అర్హ

ఇటీవలే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు పాపకు జన్మనిచ్చారు. ఆమెకు అర్హ అనే పేరు పెట్టారు. అర్హ పుట్టిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్హ ఫోటోల కోసం క్లిక్ చేయండి.

సినిమాలు

సినిమాలు

బన్నీ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం' అనే సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది.

తర్వాత చేయబోయే మూవీ

తర్వాత చేయబోయే మూవీ

దువ్వాడ జగన్నాథమ్ సినిమా తర్వాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

English summary
Allu Arjun Visits Tirumala With His Family Members . On this occasion Allu Arjun has shared a lovely pic showing him and his son in traditional panchekattu(Lungi) avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu