»   » బాహుబలి 2 మీద మళ్లీ విమర్శలు, కాపీ కొట్టారంటూ...

బాహుబలి 2 మీద మళ్లీ విమర్శలు, కాపీ కొట్టారంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'బాహుబలి'. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి భాగం 'బాహుబలి-ది బిగినింగ్' ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది బాహుబలి రెండో భాగంగా 'బాహుబలి-ది కంక్లూజన్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా సినిమా ప్రమోషన్ల భాగంగా మహా శివరాత్రికి విడుదల చేసిన పోస్టర్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంగ్ బ్యాక్-2 పోస్టర్ మాదిరిగానే బాహుబలి 2 పోస్టర్ ఉందని, తన సినిమాకు సంబంధించిన అన్ని పోస్టర్ లని హాలీవుడ్ నుండే రాజమౌళి కాపీ కొడుతున్నాడంటూ... కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


బాహుబలి సినిమాకు సంబంధించిన గత పోస్టర్ల విషయంలో కూడా ఇలాంటి విమర్శలే వచ్చిన సంగతి తెలిసిందే.


పట్టించుకోవాల్సిన అవసరం లేదు

పట్టించుకోవాల్సిన అవసరం లేదు

సాధారణంగా ఒక పెద్ద ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నపుడు కొందరు ఇలాంటివి పని గట్టుకుని ప్రచారం చేయడం మామూలే. అందుకే మొదటి నుండి ఇలాంటివి అసలు పట్టించుకోడం లేదు రాజమౌళి. తన సినిమా సత్తా ఏమిటో బాక్సాఫీసు వద్దనే నిరూపించుకోవాలనే ఆలోచనలో ముందుకు సాగుతున్నారు.


‘బాహుబలి' లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటో)

‘బాహుబలి' లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటో)

బాహుబలి రెండు పార్టుల కోసం ప్రభాస్.... మొత్తం 613 రోజులు సూటింగులో పాల్గొన్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ పాల్గొన్న చివరి రోజు ఫోటో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వందల రోజుల కష్టం అనంతరం ప్రభాస్ ఎట్టకేలకు గుమ్మకాయ కొట్టేసాడు. పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.


రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం

రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం

దాదాపు మూడున్నరేళ్లుగా'బాహుబలి' ప్రాజెక్టే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.... ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో అందులో నుండి బయటకు వచ్చి ఇతర సినిమాలపై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ఇటీవల ప్రారంభం అయింది. యూవి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం దాదాపు రూ. 150 కోట్ల తో తెలుగు, తమిళం, హిందీల్లో ఒకే సారి చిత్రకరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


షారుక్‌ను ఎవరు కాదనుకుంటారు? బాహుబలి-2లో గెస్ట్ రోల్‌పై ...స్పందన!

షారుక్‌ను ఎవరు కాదనుకుంటారు? బాహుబలి-2లో గెస్ట్ రోల్‌పై ...స్పందన!

బాహుబలి 2 చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ.... జాతీయ మీడియాలో సైతం వార్తలు రావడంతో బాహుబలి చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. పూర్తి వివరాల కోసంక్లిక్ చేయండి.


English summary
Maha Shivarathri poster of Baahubali 2 face plagiarism allegations. Social media folks have started comparing it with that of ‘Ong Bak 2’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu