»   » వావ్..! బాలయ్య లుక్ అమేజింగ్: పూరీ మ్యాజిక్ వర్కౌట్ అవుతోంది

వావ్..! బాలయ్య లుక్ అమేజింగ్: పూరీ మ్యాజిక్ వర్కౌట్ అవుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫ్రొఫెషనల్ సింగర్లు యాక్టింగ్ చేయతం అడపాదడపా స్క్రీన్ పై కనిపించటం మామూలే, ఘంటసాల, ఎస్.పీ, బాలూ లాంటి గాయకులు అప్పుడప్పుదూ స్క్రీన్ పై కనిపించేవారు, సింగర్ సునిత కూదా యక్స్టింగ్ చేస్తోంది, అయితే అదే రివర్స్ లో కూడా జరిగింది తారలూ సింగర్స్ గా మారి పోయారు... గత కొన్నేళ్లలో చాలామంది స్టార్ హీరోలు పాటలు పాడారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి ఎప్పుడో 'మాస్టర్' సినిమాకే పాట పాడేస్తే.. నాగార్జున 'సీతారామరాజు'లో చిన్న పాట అందుకున్నాడు. ఈ మధ్య విక్టరీ వెంకటేష్ సైతం 'గురు' కోసం పాట పాడేశాడు. ఇక సీనియర్లలో ఇంకా పాట పాడనిది బాలయ్య మాత్రమే. ఆయన కూడా ఇప్పుడు పూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం గాయకుడిగా మారుతుండటం విశేషం

బాలకృష్ణ

బాలకృష్ణ

ఆటోట్యూనర్ తో గొంతుకి కూడా మేకప్ వేసే అవకాశం రావటం తో గొంతులు సవరించుకున్నారు. అయితే ఎంతయినా ఫ్రొఫెషనల్ సింగర్స్ కి ఇన్నేళ్లు తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఇప్పుడు తన గాత్రంతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

సోషల్‌మీడియాలో చక్కర్లు

సోషల్‌మీడియాలో చక్కర్లు

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం కోసం బాలకృష్ణ గొంతు సవరించుకున్నారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. స్టూడియోలో బాలకృష్ణ పాట పాడుతుండగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాలయ్య యంగ్ లుక్

బాలయ్య యంగ్ లుక్

పాట సంగతి పక్కన పెడితే అభిమానులకి ఆనందం, కామన్ ప్రేక్షకులకి ఆశ్చర్యం కలిగించిన విషయం బాలయ్య యంగ్ లుక్. మళ్ళీ కనీసం 20 ఏళ్ళ వయస్సు తగ్గినట్టు కనిపిస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య 101 వ చిత్రం పూరి జగన్నాథ్ తో తీస్తున్న విషయం తెలిసిందే.

బాలయ్య ని పూరి ఎలా చూపిస్తాడో

బాలయ్య ని పూరి ఎలా చూపిస్తాడో

సాదారణంగా పూరి చిత్రాలు చాలా డిఫరెంట్ మోడ్ లో ఉంటాయి..మాస్, క్లాస్,మాఫియా కూడా ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణతో తీస్తున్న చిత్రంలో బాలయ్య ఎలా తయారౌతాడో ? బాలయ్య ని పూరి ఎలా చూపిస్తాడో అని ఆశగా ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ . అయితే వాళ్ళ ఆశలకు తగ్గట్లుగానే బాలయ్య కొత్తగా కనిపిస్తున్నాడు. మామూలుగా పూరీ సినిమాల్లో ఉండే హీరో ఎక్కడా తగ్గినట్టు కనిపించడు. శారీరకంగా కూడా మరింత బలంగా, దూకుడు గా ఉంటాడు.

టీషర్ట్ తో బైసిప్స్ కనిపించేలా

టీషర్ట్ తో బైసిప్స్ కనిపించేలా

ఇన్నాళ్ళూ చూసిన బాలయ్య వేరు ఆ సినిమాల్లో బాలకృష్ణలో రాజసం లాంటి ప్రవర్తనే ఉంటుంది, తెల్ల పంచె, చేతిలో కత్తి తీ కనిపించే బాలయ్య లో ఒక మెచూర్డ్ మ్యాన్ అనే ఫీల్ తప్ప యంగ్ అండ్ డైనమిక్ ఫీల్ రాదు. ఫైట్లలో కూడా బాలయ్య తీరు వేరు. కానీ ఈసారి మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ ఉండే టీషర్ట్ తో బైసిప్స్ కనిపించేలా యూత్ఫుల్ లుక్ తో కనిపించే పూరీ హీరోగా బాలకృష్ణ ఎన్నాళ్ళు గానో పూరీ కి దూరంగా ఉన్న హిట్ ని వడ్డీ తో సహా అతని చేతుల్లో పెట్టేటట్టే కనిపిస్తున్నాడు.

సెప్టెంబర్ 29న

సెప్టెంబర్ 29న

శాతకర్ణి కోసం పెంచిన మీసం అలాగే ఉంచాడు బాలయ్య దానికి కొనసాగింపు గా గడ్డం పెంచాడు దాంతో రెంటికి బాగానే సరిపోయింది. ఈ చిత్రం త్వరగా పూర్తి చేసుకొని సి. కళ్యాన్ తో మరో చిత్రంలో నటించబోతున్నారు బాలయ్య. ఈ సినిమాని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలనీ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.

English summary
After Gautami Putra Shatakani, Actor Nandamoori Balakrishna doing movie with Director Puri Jagannadh. balayya's New look forthis movie is criating sansation in Social meadia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu