»   » అందువల్లే బాలయ్య వాయిస్ అలా: అభిమానులు ఆందోళన పడొద్దు

అందువల్లే బాలయ్య వాయిస్ అలా: అభిమానులు ఆందోళన పడొద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పైసా వసూల్ నిన్నటినుంచీ బాలయ్య అభిమానుల కి పండగ వాతావరణం తెచ్చింది. ఇప్పటికి కొంత మిక్స్‌డ్ టాక్ నడుస్తున్నప్పటికీ సినిమా మీద మంచి అభిప్రాయాలే ఉన్నాయి. అయితే సినిమా సంగతికంటే కూడా బాలయ్య అభిమానులని కలవరపెట్టింది ఆయన గొంతు. కొంత బొంగురుగా ఉన్న వాయిస్ స్టంపర్ లో విన్నప్పుడే కాస్త ఆందోళన పడ్డారు..

ఫేస్బుక్ లైవ్ లోకూడా

ఫేస్బుక్ లైవ్ లోకూడా

తర్వాత ఫేస్బుక్ లైవ్ లోకూడా ఆయన గొంతు అలాగే వినిపించటం తో బాలయ్య గొంతుకి ఏమైంది? అని ఓ అభిమాని అడిగాడు. దానికి పూరీ జ‌గ‌న్నాథ్ స‌మాధానం చెబుతూ.. నిన్న తీసిన వ‌ర్షం సాంగులో బాల‌య్య బాబు తడిచారని, దీంతో ఆయ‌న గొంతు అలా మారిపోయింద‌ని కారణం చెప్పారు.

ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు

ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు

కానీ పైసా వసూల్ స్టంపర్ మేకింగ్ కు, అడియో సక్సెస్ మీట్ కు మధ్య కాస్త ఎక్కువ గ్యాప్ నే వుంది. మరి ఇన్ని రోజులైన బాలయ్య గొంతు సరికాకపోవడం ఏమిటి? పైగా మంచి మంచి డాక్టర్లు అందుబాటులో వుంటారు కదా? అంటే ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు అని కొన్ని సమాధానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

వాటర్ ఛేంజ్

వాటర్ ఛేంజ్

లేదా ఎక్కువ రోజులు కంటిన్యూగా చకచకా వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం వల్ల గొంతుకు వాటర్ ఛేంజ్ కారణంగా గొంతుకు సమస్య వచ్చి వుండొచ్చు అంటున్నారు. సాధారణంగా మన హీరోలు మంచు ప్రాంతాల్లో, లేదా విదేశాల్లో షూట్ చేసి వచ్చిన తరువాత గొంతు సమస్యలతో బాధపడడం కామన్.

పూరి అలా కాదు

పూరి అలా కాదు

అందుకే వెంటనే డబ్బింగ్ చెప్పరు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని చెబుతారు. బోయపాటి లాంటి డైరక్టర్లు బాలయ్య లాంటి వాళ్ల చేత ఏక బిగిన డబ్బింగ్ చెప్పించరు. రోజుకు రెండు మూడు సీన్లు మాత్రం చెప్పించుకుంటూ వెళ్తారు. కానీ పూరి అలా కాదు. పని ప్రారంభిస్తే ఫినిష్ అయిపోవాల్సిందే.

వార్తలు గా, యూట్యూబ్ వీడియోలుగా

వార్తలు గా, యూట్యూబ్ వీడియోలుగా

బహుశా ఈ స్ట్రెయిన్ లు అన్నీ కలిసి గొంతు అలా అయిందేమో అనుకున్నారు.కానీ సినిమా తర్వాత కూడా బాలకృష్ణ గొంతు అలాగే వినిపించటం తో జనాల్లో అత్యుత్సాహం, అభిమానుల్లో ఆందోళనా పెరిగాయి. ఆఖరికి ఈ గొంతు విషయం "వార్తలు గా, యూట్యూబ్ వీడియోలుగా కూడా మారటం తో.. ఇక ఆ విషయాన్ని క్లియర్ చేయాలనుకున్నాడేమో తన వాయిస్ అలా ఎందుకయ్యిందో చెప్పేసాడు.

అసలు కారణమేంటో బాలయ్య వెల్లడించాడు

అసలు కారణమేంటో బాలయ్య వెల్లడించాడు

ఐతే తన గొంతు అలా తయారవడానికి అసలు కారణమేంటో బాలయ్య వెల్లడించాడు. తకకు తన తండ్రి ఆల్ టైం క్లాసిక్ 'శివశంకరి శివానంద లహరి'.. అనే పాట అంటే చాలా చాలా ఇష్టమని.. ఆ పాటను తరచుగా వింటుంటానని.. ఆ పాటను ఎప్పటికైనా లైవ్‌లో పాడాలన్నది తన కోరిక అని.. అందుకోసం చాలా కాలంగా సాధన చేస్తున్నానని.. మరీ అతిగా ప్రాక్టీస్ చేసి గొంతు మీద ఒత్తిడి తేవడంతో బొంగురు పోయిందని వెల్లడించాడు బాలయ్య.

మామా ఏక్ పెగ్ లా

మామా ఏక్ పెగ్ లా

త్వరలోనే గొంతు సర్దుకుంటుందని బాలయ్యా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు తన సినిమాల్లోని ఒకట్రెండు పాటల్ని స్టేజ్ మీద పెర్ఫామ్ చేసిన బాలయ్య.. 'పైసా వసూల్'లో మామా ఏక్ పెగ్ లా అనే పాటను పాడేసిన సంగతి తెలిసిందే. మరి శివరంజని పాటను లైవ్‌లో పెర్ఫామ్ చేయాలన్న కలను బాలయ్య ఎప్పుడు నెరవేర్చుకుంటాడో చూద్దాం.

English summary
Nandamuri Balakrishna opensup about his Rusty Voice in Paisa Vasool
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu