»   » చిరంజీవి 150 సినిమాపై... అంతా టాప్ సీక్రెట్!

చిరంజీవి 150 సినిమాపై... అంతా టాప్ సీక్రెట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా నుండి పూరి జగన్నాథ్ తప్పుకోవడం ఖరారైంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించక పోయినా జరిగేది జరిగిపోయింది. అసలు ఏమైంది? పూరి జగన్నాథ్ ఈ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకున్నారు? ఇద్దరి మధ్య ఏమైనా విబేధాలు వచ్చాయా? పూరి చెప్పిన స్టోరీ చిరంజీవికి నచ్చలేదా?....ఇలా ఏ విషయం కూడా బయటకు పొక్కకుండా అంతా టాప్ సిక్రెట్ మెయింటేన్ చేస్తున్నారు.

వాస్తవానికి పూరి జగన్నాథ్ రాసుకున్న స్టోరీ ఫస్టాఫ్ చిరంజీవికి చెప్పి ఒప్పించారు. చిరంజీవి కూడా సంతృప్తి వ్యక్తం చేసారు. అయితే సెకండాఫ్ విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. చిరు 150వ ప్రాజెక్టు నుండి పూరి తప్పుకోవడంతో తెరపైకి వివి వినాయక్ పేరు వచ్చింది. దీంతో చిరంజీవి 150వ సినిమా మళ్లీ మొదటికి వచ్చింది.

Delay in Chiranjeevi's 150th movie shoot

చిరు 150వ సినిమా ఎప్పుడు మొదలువుతంది...ఎప్పుడు విడుదలవుతుందో తెలియక అభిమానులు అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం వివి వినాయక్ అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు. అఖిల్ సినిమా దసరాకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు వినాయక్‌ చాలా బిజీ.

ఒక వేళ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆగస్టు 22న సినిమా లాంఛనంగా ప్రారంభించినా..... వినాయక్ బిజీ అయ్యేది దసరా తర్వాతే కాబట్టి అక్టోబర్లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ లుక్క ప్రకారంచూస్తే వచ్చే సంక్రాంతికి చిరంజీవి సినిమా లేనట్లే అని స్పష్టమవుతోంది.

English summary
Megastar Chiranjeevi has announced his 150th movie and it seems that the project might be delayed.
Please Wait while comments are loading...