»   » బాలయ్య గుండెల్లో గోలీసోడా.. కొట్టిందెవరంటే..

బాలయ్య గుండెల్లో గోలీసోడా.. కొట్టిందెవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నట సింహం నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ శరవేగంగా తెరకెక్కుతున్నది. వేసవి మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఈ సినిమాను పూర్తి చేయడానికి అహర్నిశలు కష్టపడున్నది చిత్ర యూనిట్. చిత్రంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు దర్శకుడు పూరి. అంతేకాకుండా వెంటవెంటనే ఎడిటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి చూపించగా బాలకృష్ణ ఆశ్చర్యపోయాడట. పూరి స్టైల్ ‌ఆఫ్ వర్క్‌ను చూసి బాలయ్య ప్రశంసించారని ఫిలింనగర్ సమాచారం. తాజాగా బాలయ్య బాబుపై పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు.

బాలయ్యతో మాస్ పాట..

బాలయ్యతో మాస్ పాట..

కీలక సన్నివేశాలను తెరకెక్కించిన వెంటనే వేసవి తాపాన్ని మరిచిపోయేందుకు బాలకృష్ణతో స్టెప్పులు వేయిస్తున్నారు పూరి. బాలయ్య‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన స్థాయికి తగ్గకుండా అభిమానులను సంతృప్తి పరిచేందుకు వందల మంది డ్యాన్సర్లతో ఓ పాటను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాటను బాలకృష్ణ, అందాల తార మిస్కిన్‌పై తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఆనంద్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

పులగం చిన్నారాయణ క్రేజీ సాంగ్..

పులగం చిన్నారాయణ క్రేజీ సాంగ్..

బాలయ్య రేంజ్‌లో ‘నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అవుతున్నట్టున్నాదే... గుండెల్లో గోలీసోడా కొట్టేసినట్టున్నాదే' అనే మాస్ పాటను గీత రచయిత పులగం చిన్నారాయణ రచించారు. ఈ పాటకు శోభి మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాటకు క్రేజీ ట్యూన్‌ను సంగీత దర్శకుడు అనూప్ అందించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి..

బహుముఖ ప్రజ్ఞాశాలి..

బహుముఖ ప్రజ్ఞాశాలి పులగం చిన్నారాయణ జర్నలిస్టుగా, సినీ పాటలు, మాటల రచయితగా, పీఆర్వోగా సుపరిచితులు. గతంలో ఆయన రాసిన పాటలు సంగీత అభిమానులను ఆకట్టుకొన్నాయి. ఇటీవల ఆయన రాసిన పసిడి తెర పుస్తకం విశేష ఆదరణ పొందుతున్నది. చిన్నప్పటి నుంచే రచనా వ్యాసంగంపై మక్కువ ఉన్న చిన్నారాయణ కవితలు, కథలు, సినిమా వ్యాసాలు, పుస్తకాలు రాస్తూ వచ్చారు. అలా పాఠకులతో రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఆయనది.

రచయితగా..

రచయితగా..

పులగం చిన్నారాయణ వివిధ పత్రికల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం, సినిమా మీద ప్రేమతో ఆయన ఇప్పటి దాకా 6 సినీ గ్రంథాలు పాఠకులకు అందించారు. జంధ్యాల తీసిన మొత్తం 39 సినిమాల నిర్మాణ విశేషాల ‘జంధ్యామారుతం', నంది అవార్డు అందుకున్న ‘ఆనాటి ఆనవాళ్ళు', అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కళాత్మక చిత్రావలోకనం - ‘సినీ పూర్ణోదయం', తెలుగు సినిమా సంగీతంపై ప్రగాఢ ముద్ర వేసిన సంగీత దర్శకుల స్వరజీవిత సమాహారం - ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు' తరువాత వచ్చిన పుస్తకం - ‘పసిడి తెర'.

అభిమానులకు ఆకట్టుకొనే విధంగా..

అభిమానులకు ఆకట్టుకొనే విధంగా..

‘బాలకృష్ణ అభిమానులకు అన్ని విధంగా నచ్చేటట్టు రచయిత పులగం చిన్నారాయణ మంచి మాస్‌ పాటను అందించారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ తీర్చిదిద్దాం. నాలుగు రోజుల పాటు పాటని చిత్రీకరిస్తాం. బాలయ్య-పూరి కాంబినేషన్‌ అనగానే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. వాటిని తప్పకుండా అధిగమించే చిత్రమవుతుంది. ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం అని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు.

English summary
Actor Balakrishna, Director Puri Jagannadh's maiden venture under production. Important scences are pictiresed recently. Now Unit are planning to shoot a song on Balaiah, actress Miskin soon. This song penned by lyric writer Pulagam Chinnarayana. This movie producer is Anand Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu