»   » హీరోయిన్ల గుండెల్లో రైళ్లు.. కాజల్, లావణ్య, రాశీఖాన్నాకు ‘డ్రగ్’ లింకు?. కొంపముంచిన మేనేజర్

హీరోయిన్ల గుండెల్లో రైళ్లు.. కాజల్, లావణ్య, రాశీఖాన్నాకు ‘డ్రగ్’ లింకు?. కొంపముంచిన మేనేజర్

Written By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. ఇప్ప‌టికే టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో సినీ ప్రముఖులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, నవదీప్, తరుణ్ తదితరులను విచారించారు. మంగళవారం త‌నీష్, ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కాజ‌ల్ మేనేజ‌ర్ డ్ర‌గ్స్ కేసులో పట్టుపడటం సంచలనం రేపింది. దాంతో మరికొంత మంది సినీ ప్రముఖులకు డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి.

కాజల్ మేనేజర్ అరెస్ట్..

కాజల్ మేనేజర్ అరెస్ట్..

హైదరాబాద్ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే విధంగా మారిన డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఎక్పైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఒకవైపు విచారణ నిర్వహిస్తూనే మరోవైపు సోదాలు చేస్తూ నిందితులకు దడ పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సినీ హీరోయిన్ కాజల్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రాన్‌సన్ జోసెఫ్ అలియాస్ రోనిని అరెస్ట్ చేయడం టాలీవుడ్‌లో కలకలం రేపింది.

Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
రాశీఖన్నా, లావణ్య త్రిపాఠికూ మేనేజర్

రాశీఖన్నా, లావణ్య త్రిపాఠికూ మేనేజర్

బంజారాహిల్స్‌లో జోసెఫ్ ఇంట్లో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నట్టు ఎక్పైజ్ శాఖ ఈడీ అకున్ సబర్వాల్ వెల్లడించారు. గతంలో ప్రముఖ హీరోయిన్లు రాశీఖన్నా, లావణ్యత్రిపాఠికి రోని మేనేజర్‌గా వ్యవహరించడం గమనార్హం. రోనీ నివాసం నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రోని ఇంట్లో గంజాయి దొర‌క‌డంతో వెంట‌నే అత‌డిని అరెస్ట్ చేసి అధికారులు రిమాండ్ కు త‌ర‌లించారు.

కూపీలాగుతున్న సిట్

కూపీలాగుతున్న సిట్

రోనిని అరెస్ట్ చేసిన అధికారులు అతడి నుంచి కూపీ లాగేందుకు విచారిస్తున్నారు. రోని విచారణలో మరికొంత మంది కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. జోసెప్ వద్ద డ్రగ్స్ లభ్యమవ్వడంతో పరిశ్రమలోని మరికొంత మంది హీరోయిన్లకు సంబంధాలు ఉండవచ్చని సిట్ అనుమానిస్తున్నారు.

కాల్ డేటా ఆధారంగా విచారణ వేగవంతం..

కాల్ డేటా ఆధారంగా విచారణ వేగవంతం..

కెల్విన్ అందించిన సమాచారం సినీ ప్రముఖుల కాల్ డేటా ఆధారంగా రానున్న రోజుల్లో మరికొందరు సినీనటులకు నోటీసులు పంపే అవకాశం ఉంది. దీంతో టాలీవుడ్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందనే భయం పలువురు నిర్మాతలను వెంటాడుతున్నది. డ్రగ్ కేసు వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Trouble for Tollywood actress Kajal Agarwal, Lavanya Tripathi, Rashi Khanna. Heroine Kajal Manager Ronie arrested in hyderabad. Lot of Ganja was seized from Ronie's house. There may more arrest in this drug Mafia connection.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu