»   » విశాఖ తీరంలో పోరాటాన్ని వివరించి చిరంజీవి.. (ఘాజీ న్యూ ట్రైలర్)

విశాఖ తీరంలో పోరాటాన్ని వివరించి చిరంజీవి.. (ఘాజీ న్యూ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో రానా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఘాజీ'. రానాతో పాటు తాప్సీ, కయ్ కయ్ మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితులు ప్రధాన పాత్రలు పోషించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టెన్మెంట్స్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించారు.

తెలుగు, తమిళం, హిందీ బాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రానికి తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. చిరంజీవి వాయిస్ ఓవర్ తో కూడిన కొత్త ట్రైలర్ తాజాగా విడుదల చేసారు.

rnrn

మెగాస్టార్ వాయిస్ సినిమాకు ప్లస్

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అవుతుందిన అంటున్నారు. చిరంజీవి వాయిస్ తో కూడిన ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

 రిలీజ్ ఎప్పుడంటే

రిలీజ్ ఎప్పుడంటే

1971లో భారత్ -పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో నీట మునిగిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించాడు. స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావ‌డం విశేషం. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కాబోతోంది.

 ది బెస్ట్ క్లైమాక్స్

ది బెస్ట్ క్లైమాక్స్

'ఘాజీ' కోసం ఏకంగా ఐదు క్లైమాక్స్‌లను రాసుకున్నాడట దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి. ఆ తరువాత ఆ క్లైమాక్స్‌లను యూనిట్ సభ్యులతో పాటు కొంత మంది బాలీవుడ్ రచయితలను కూడా సంప్రదించి వాటిలో బెస్ట్‌ను ఫైనల్ చేసి దాన్నే సినిమాలో చూపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ నో చెప్పడంతో చిరంజీవితో చెప్పించారా?

ఎన్టీఆర్ నో చెప్పడంతో చిరంజీవితో చెప్పించారా?

అయితే తెలుగులో చిరంజీవిని సంప్రదించడానికంటే ముందు జూ ఎన్టీఆర్ తో వాయిస్ చెప్పిద్దామని అనుకున్నారట. అయితే ఓ సెంటిమెంటు కారణంగా, తన వల్ల సినిమాకు చేటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ వెనక్కి తగ్గారట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Ghazi Telugu Movie Latest Trailer with Mega Star Chiranjeevi Voice Over on PVP Cinema. Ghazi latest 2017 movie ft. Rana Daggubati, Taapsee Pannu, Kay Kay Menon, Atul Kulkarni and Rahul Singh. Music by Krishna Kumar / K and directed by Sankalp Reddy. Produced by PVP under the banner PVP Cinema and Matinee Entertainments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu