»   » బన్నీ ఇరక్కొట్టి కుమ్మేసాడు : పూరి(ప్లాటినమ్ డిస్క్ ఫోటోలు)

బన్నీ ఇరక్కొట్టి కుమ్మేసాడు : పూరి(ప్లాటినమ్ డిస్క్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, ఆమలాపాల్, కేథరిన్ ప్రధానపాత్రధారులుగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన 'ఇద్దరమ్మాయిలతో..' చిత్రం ఈనెల 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఆడియో మంచి విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో హెక్సా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు.

దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...ఇదొ కలర్ ఫుల్ లవ్ స్టోరీ, బన్నీ ఇరక్కొట్టి, కుమ్మి అవతల పడేసాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేసాం. ట్రైలర్లకు, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. శుక్రవారం వచ్చే రిజల్ట్ కోసమే అంతా వెయిట్ చేస్తున్నామని తెలిపారు.

ఇద్దరమ్మాయిలతో మూవీ హెక్సా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ దృశ్యం

సినిమా గురించి మాట్లాడుతన్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో బన్నీ ఇకక్కొట్టి కుమ్మి అవతల పడేసాడని, సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు పూరి

హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకలో హీరోయిన్ కేథరిన్, అల్లు అర్జున్, పూరి జగన్నాథ్

హీరోగా షీల్డ్ అందజేస్తున్న నిర్మాత బండ్ల గణేష్

హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.... దేవిశ్రీ నా సినిమాకు పని చేసిన ప్రతి సారి గతంలో కంటే బెస్ట్ మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. మరోసారి మంచి ఆడియో ఇచ్చినందుకు థాంక్స్. పూరి జగన్నాథ్‌ తో రెండో సారి చేస్తున్నాను. ఈ సినిమా ఆయన నాపై ప్రేమతో చేసాడు. ఒక సినిమాకు ఎంతో మంది కలిసి పని చేస్తుంటారు. అందరి ఈగోలు మేనేజ్ చేస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లడం ఎలాగో నిర్మాత బండ్ల గణేష్‌కు బాగా తెలుసు. ఆయన చెబుతున్నట్లు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

పూరి జగన్నాథ్, బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మరో చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని, థియేటర్ ట్రైలర్లకు, టీజర్‌కు రెస్పాన్స్ లభించిందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: అమూల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.

English summary
The hexa platinum disc function of Allu Arjun, Amala Paul and Catherine Tresa starrer 'Iddharammayilatho' has been done in Hyderabad. Puri Jagannadh, Allu Arjun, Catherine Tresa, Bandla Ganesh, Dil Raju, Amol Rathode, Viswa, Bhaskara Bhatla etc have attended the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu